చాగల్లు ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఎస్పీ

ABN , First Publish Date - 2022-09-09T05:13:28+05:30 IST

పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు ప్రాజెక్ట్‌లోని నీటిమట్టాన్ని గురువారం ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు.

చాగల్లు ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఎస్పీ

తాడిపత్రి, సెప్టెంబరు 8: పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు ప్రాజెక్ట్‌లోని నీటిమట్టాన్ని గురువారం ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. ప్రాజెక్ట్‌ నీటి సామర్థ్యం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో గురించి అధికారులతో ఆరా తీశారు. అనంతరం ఆయన విలేక రులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ నీటిని విడుదల చేయడం వల్ల  ముంపు నకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని కోరారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని తెలి పారు. పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల్లోని గ్రామాలతోపాటు తాడిపత్రి పట్టణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నదిపరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తెలిపారు. పెన్నానది నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని పలుచోట్ల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం డీఎస్పీ చైతన్యతో పాటు ఇరిగేషన్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 


Read more