రిపబ్లిక్ డే ప్రీ పరేడ్ కు ఎస్కేయూ విద్యార్థి
ABN , First Publish Date - 2022-01-20T06:03:26+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే ప్రీపరేడ్కు ఎస్కేయూ విద్యార్థి మహిచందన ఎంపికైంది.

అనంతపురం అర్బన, జనవరి 19 : దేశరాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే ప్రీపరేడ్కు ఎస్కేయూ విద్యార్థి మహిచందన ఎంపికైంది. ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటువీవీఐపీలు పాల్గొనే పరేడ్ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో జిల్లా నుంచి ఎస్కేయూ విద్యార్థి మహిచందన ఎంపికవ్వడం విశేషం. మహిచందన ఎస్కేయూ అనుబంధ కేఎస్ఎస్ఎన మహిళా డిగ్రీ కళాశాల లో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం అభ్యసిస్తోంది. ఎనసీసీ, ఎనఎస్‌ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న మహిచందన రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపిక కావడంపై ఎస్కేయూ, కేఎస్ఎస్ఎన బాలికల డిగ్రీక ళాశాల అధికారులు, అధ్యాపకులు అభినందించారు.