ఇళ్లుఎప్పుడు కట్టిస్తారు సారూ... ?

ABN , First Publish Date - 2022-11-24T23:53:32+05:30 IST

మాకు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారూసారూ? అని చెరువుమరవ తండా వాసులు ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డిని ప్రశ్నించారు.

ఇళ్లుఎప్పుడు కట్టిస్తారు సారూ... ?

ఎమ్మెల్యేను ప్రశ్నించిన గిరిజనులు

గాండ్లపెంట, నవంబరు 24: మాకు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారూసారూ? అని చెరువుమరవ తండా వాసులు ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డిని ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలపరిధిలోని వేపరాల పంచాయతీలోని చెరువుమరవ తండా, వేపరాల, తాళ్లకాలువలో ఎమ్మెల్యే పర్యటించారు. చెరువుమరవతండాలో తండా మహిళలు ఎమ్మెల్యేతో మాట్లాడు తూ... తమకు ఇళ్లుఎప్పుడు కట్టిస్తారని ప్రశ్నించారు. త్వరలో ఇళ్లు కట్టిస్తామని సమాధానమిచ్చారు. దీంతో మహిళలు మాట్లాడుతూ... మూడేళ్లు అయినా ఒక ఇల్లు కూడా తమకు ఇవ్వలేదని, ఇప్పుడు కూడా త్వరలో ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో భారీ వర్షాల వలన చెవురుకు దగ్గరగా ఉన్న తండాలోని ఇళ్లలోనికి నీరు చేరి ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ఇప్పటికైనా స్పందిస్తారా లేదా హామీలకే పరిమితమా అని తండావాసులు చర్చించుకుం టున్నారు.

Updated Date - 2022-11-24T23:53:32+05:30 IST

Read more