కసాపురంలో వెండి రథ ప్రాకారోత్సవం

ABN , First Publish Date - 2022-09-11T05:41:25+05:30 IST

కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శని వారం సాయంత్రం స్వామివార్లకు వెండి రథంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.

కసాపురంలో వెండి రథ ప్రాకారోత్సవం

గుంతకల్లు, సెప్టెంబరు 10: కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శని వారం సాయంత్రం స్వామివార్లకు వెండి రథంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. శ్రావణ మాసా నికి ముందే ప్రతి శనివారం స్వామవార్లకు ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలను వెండిరథంపై అలంకారాలుచేసి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికా రులు, భక్తులు పాల్గొన్నారు.Read more