ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-28T05:48:30+05:30 IST

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్‌ బసంత కుమార్‌ సూచించారు. మంగళవారం శిరివరం, మానెంపల్లి, పులమతి సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి : కలెక్టర్‌
మానెంపల్లి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంతకుమార్‌

లేపాక్షి, సెప్టెంబరు 27: సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్‌ బసంత కుమార్‌ సూచించారు. మంగళవారం శిరివరం, మానెంపల్లి, పులమతి సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బందికి సూచనలి చ్చారు. సచివాలయానికి సమయానికి చేరుకోవాలని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా సేవలందించాలన్నారు. సిబ్బంది డ్రస్‌కోడ్‌ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ నరసింహనాయుడు, మం డల కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 


Read more