శిక్షణపై ఆసక్తి చూపని సచివాలయ సిబ్బంది
ABN , First Publish Date - 2022-12-16T00:06:17+05:30 IST
గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి ప్రణాళిక 2023-24కు సంబంధించి సచివాలయ సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణా తరగతులకు స్పందన లేక ఖాళీ కుర్చీలు దర్శ న మిచ్చాయి.
- 144 మందికి 70మంది హాజరు
యాడికి, డిసెంబరు 15: గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి ప్రణాళిక 2023-24కు సంబంధించి సచివాలయ సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణా తరగతులకు స్పందన లేక ఖాళీ కుర్చీలు దర్శ న మిచ్చాయి. 144మంది సిబ్బం దికి గాను 70మంది మాత్రమే హాజరుకా వడం గమనార్హం. ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన తరగతులు 11గంటలకు ప్రారంభమయ్యాయి. గురువారం మండలకేంద్రం యాడికిలోని సమావేశ భవనంలో ఎంపీడీఓ వెంకటేష్ అధ్యక్షతన శిక్షణా తరగతులు నిర్వహించారు. వీటికి మండలవ్యాప్తంగా ఉన్న 16 సచివాల యాల్లోని సిబ్బంది 70మంది మాత్రమే హాజరయ్యారు.