బడికి తాళం

ABN , First Publish Date - 2022-12-07T01:16:23+05:30 IST

కుందుర్పి మండల పరిధిలోని యర్రగుంట ఉన్నత పాఠశాల ఆవరణంలో 20 రోజుల క్రితం ఖననం చేసిన మృతదేహాన్ని ఇంకా తొలగించలేదు. బండమీదపల్లికి చెందిన నాగరాజు తన భార్య మృతదేహాన్ని ఆ స్థలంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారని అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

బడికి తాళం
పాఠశాల ముందు నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

ఆవరణలోనే మృతదేహం

అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం

కుందుర్పి మండల పరిధిలోని యర్రగుంట ఉన్నత పాఠశాల ఆవరణంలో 20 రోజుల క్రితం ఖననం చేసిన మృతదేహాన్ని ఇంకా తొలగించలేదు. బండమీదపల్లికి చెందిన నాగరాజు తన భార్య మృతదేహాన్ని ఆ స్థలంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారని అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో మంగళవారం పాఠశాలకు తాళం వేసి ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కరిస్తామని ఆర్డీవో, రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చి 20 రోజులు గడిచిందని, ఇంకెప్పుడు పరిష్కరిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు తాళం తీసేది లేదని తేల్చిచెప్పారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు ఉదయం 11 గంటల వరకు పాఠశాల వద్ద వేచిచూసి, తిరుగుముఖం పట్టారు.

- కుందుర్పి

Updated Date - 2022-12-07T01:16:26+05:30 IST