ఎస్సీ వర్గీకర ణలో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-10-08T05:01:27+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై మోసం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య హెచ్చరించారు.

ఎస్సీ వర్గీకర ణలో నిర్లక్ష్యం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న దండు వీరయ్య

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య

పెనుకొండ, అక్టోబరు 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై మోసం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య హెచ్చరించారు. శుక్రవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఎమ్మార్పీఎస్‌ 9వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, నాయకులు లక్ష్మీనారాయణ, నరసింహులు, రామకృష్ణ, రవి, మూర్తి, రఘు, శీను, దండోర రామాంజనేయులు పాల్గొన్నారు.


Read more