ఒక్కచాన్సతో రాష్ట్రాన్ని నాశనం చేశారు: బీకే

ABN , First Publish Date - 2022-12-16T23:49:49+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అ ధోగతి పాలైందని, ఒక్కచాన్సతో అభివృద్ధిని నాశనం చేశారని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించా రు.

ఒక్కచాన్సతో రాష్ట్రాన్ని నాశనం చేశారు: బీకే

పరిగి, డిసెంబరు 16: వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అ ధోగతి పాలైందని, ఒక్కచాన్సతో అభివృద్ధిని నాశనం చేశారని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించా రు. శుక్రవారం మండలంలోని శీగుపల్లిలో పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేశారు. ఈసందర్భంగా బీకే మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటాయన్నారు. నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తున్నదన్నారు. అధికారంలోకి వస్తే లక్షల్లో ఉద్యోగా లు ఇస్తామని చెప్పి, వలంటీరు ఉద్యోగాలతో సరిపెట్టారన్నారు. దే శంలో ఎక్కడా లేని విధంగా డీజల్‌, పెట్రోల్‌ ధరలు ఉండటంతో ని త్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. టీడీపీ హ యాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని విమర్శించారు. కొత్త ప్రాజెక్ట్‌లు రాకపోగా, ఉన్న ప్రాజెక్ట్‌లు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, దీనికి జగన్మోహనరెడ్డి బాధ్యుడన్నారు. స్వలాభం తప్ప రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎ న్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతారన్నారు. వైసీపీ నాయకులు పంచభూతాలను సైతం విక్రయాలకు ఉంచారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నప్పయ్య, మండల కన్వీనర్‌ లక్ష్మీరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, వాల్మీకి సాధికార సమితి సభ్యులు ఈశ్వరప్ప, శేఖర్‌, లలితమ్మ, గంగాధర్‌, హనుమంతు, సోమశేఖర్‌, రాజేష్‌, రామాంజి, నంజుండప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:49:53+05:30 IST