కాటి కష్టం..!

ABN , First Publish Date - 2022-08-18T05:04:32+05:30 IST

మండలంలోని కంబాలపల్లిలో కాటికెళ్లేందుకూ కష్టం వచ్చిపడింది. గ్రామానికి చెందిన దళితులు చనిపోతే శ్మశాన వాటికకు తరలించాలంటే వాగును దాటాల్సి వస్తోంది.

కాటి కష్టం..!

రొద్దం 

మండలంలోని కంబాలపల్లిలో కాటికెళ్లేందుకూ కష్టం వచ్చిపడింది. గ్రామానికి చెందిన దళితులు చనిపోతే శ్మశాన వాటికకు తరలించాలంటే వాగును దాటాల్సి వస్తోంది. నడుము లోతు నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, వెళ్లాల్సి వస్తోంది. యువకులు, పురుషులే వాగు దాటి, అంత్యక్రియలు పూర్తి చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు వాగు వద్దే ఆగిపోయి, మట్టి కూడా ఇవ్వలేకపోతున్నారు. గ్రామంలోని దళితుల శ్మశానవాటికకు దారిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం చిన్నమల్లయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. నడుము లోతు నీరున్న వాగును దాటుకుని, శవాన్ని శ్మశానవాటికకు తరలించారు. ఏటా వర్షాకాలం ఇవే తిప్పలు. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాగుకు కల్వర్టు నిర్మించి, శ్మశానవాటికకు సిమెంటు రోడ్డు వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Read more