ఫిట్‌మెంట్‌పై పునరాలోచించాలి

ABN , First Publish Date - 2022-01-13T06:20:03+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై పునరాలోచించి కనీసం 30 శాతం తగ్గకుండా ఇవ్వాలని ఏపీటీ ఎఫ్‌ రాష్ట్ర ఆడి ట్‌ కన్వీనర్‌ బీకే ముత్యాలప్ప, జిల్లా కార్యదర్శి సానేరవీంద్రారెడ్డి డిమాండ్‌ చేశా రు.

ఫిట్‌మెంట్‌పై పునరాలోచించాలి

- ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

ధఽర్మవరం, జనవరి 12:  ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై పునరాలోచించి కనీసం 30 శాతం తగ్గకుండా ఇవ్వాలని ఏపీటీ ఎఫ్‌ రాష్ట్ర ఆడి ట్‌ కన్వీనర్‌ బీకే ముత్యాలప్ప, జిల్లా కార్యదర్శి సానేరవీంద్రారెడ్డి డిమాండ్‌ చేశా రు. ఆంఽధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌)రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  బుధవారం స్థానికతహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధఽర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్‌ సీపై ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటన ఉద్యోగులను తీవ్ర నిరాశను మిగిల్చిం దన్నారు. పీఆర్‌సీపై 30శాతం తగ్గకుం డా  ఉండాలని, ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సీపీ ఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాతపెన్సన్‌ విధానాన్ని అమలుచేయాలని, హెచ్‌ ఆర్‌ఏకు పాతస్లాబు విధానాన్ని కొనసాగిం చాలని తదితర సమస్యలు పరిష్క రించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీ ఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీనివాసులు, దుర్గాప్ర సాద్‌, ప్రత్యేక ఆహ్వానితులు బలరా ముడు, ఆరు మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శంకరనారాయణ, వాసు కుమార్‌, రాముడు, శ్రీనివాసులు, జగదీశ్‌, నాగభూషణ, సూర్యప్రకాశ్‌, రాఘ వేంద్ర, పెన్సనర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-13T06:20:03+05:30 IST