చరిత్రకు ప్రతిబింబాలు వేమన పద్యాలు
ABN , First Publish Date - 2022-10-30T23:47:52+05:30 IST
వేమన పద్యాలు అలనాటి చారిత్రక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబిస్తాయని ప్రముఖ చరిత్ర అధ్యాపకుడు మొవ్వా శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
చరిత్ర అధ్యాపకుడు మొవ్వా శ్రీనివాసరెడ్డి
అనంతపురం కల్చరల్, అక్టోబరు 30: వేమన పద్యాలు అలనాటి చారిత్రక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబిస్తాయని ప్రముఖ చరిత్ర అధ్యాపకుడు మొవ్వా శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వేమన ఫౌండేషన ఆధ్వర్యంలో ఆదివారం ఆనలైనలో నిర్వహించిన సాహితీ సదస్సులో ఆయన మాట్లాడుతూ గండికోట, కటారుపల్లి, కొండవీడు ఇలా ఎన్నో ప్రాంతాల విశేషాలు, కొండవీటి రెడ్డిరాజులు, స్థానిక పాలేగాళ్లు, చారిత్రక పురుషుల ప్రస్తావన వేమన పద్యాలలో కనిపిస్తాయన్నారు. వేమన పద్యాలలోని చరిత్రపై పరిశోధనలు సాగించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు ఆదినారాయణరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, విశ్రాంత వీసీ ఆచార్య రామకృష్ణారెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.