వరుడై ఊరేగిన రంగనాథుడు

ABN , First Publish Date - 2022-02-11T06:12:33+05:30 IST

తొండపాడులో వెలసిన బొలికొండ రంగనాథస్వామి వరుడై ఊరేగాడు. స్వామివారి బ్రహ్మోత్సవా లు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యా యి.

వరుడై  ఊరేగిన రంగనాథుడు
స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు

గుత్తి రూరల్‌, ఫిబ్రవరి 10: తొండపాడులో వెలసిన బొలికొండ రంగనాథస్వామి వరుడై ఊరేగాడు. స్వామివారి బ్రహ్మోత్సవా లు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యా యి. తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తొలిరోజు జక్కలచెరువులోని స్వామివారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి పెళ్లి కుమారుడిగా అలంకరించి, పల్లకిలో కొలువుదీర్చారు. గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం జ క్కలచెరువు నుంచి తొండపాడులోని ఆలయానికి పల్లకిలో స్వామివారు చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు ధ్వజారోహణ, అంకురారోపణతో ఉ త్సవాలు మొదలయ్యాయి. స్వామివారికి శుక్రవారం సింహవాహన సేవ  నిర్వహిస్తామని ఈఓ దేవదాసు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు రవిస్వామి, చేతనవర్మ, నిఖిల్‌వర్మ, భక్తులు పాల్గొన్నారు.






నేత్రపర్వంగా ధ్వజారోహణం 

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 10: భక్తుల కొంగుబంగారం, కొండమీదరాయుడి బ్రహోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం గు రువారం నేత్రపర్వంగా సాగింది. రెండో రోజు శ్రీవారి ఉత్సవ మూర్తులకు స్వామి పుట్టుశిల అయిన దేవరకొండపై ప్రత్యేక పూ జలు జరి గాయి. అంతకు మునుపు ఆలయ వేద పండితులు ధ్వజ స్థంభానికి కర్పూర హారతులు ఇచ్చి ఆరోహణం చేశారు.  అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను దేవరకొండపై నుంచి పల్లకిలో ఊరేగించారు. అనంతరం స్థానిక లక్ష్మీనారాయణస్వామి దేవాలయం వద్దకు తోడ్కొని వచ్చారు. 


పూల పల్లకిలో స్వామివారు..

ధ్వజారోహణం అనంతరం స్వామి వారిని గురువారం సాయంత్రం పూలపల్లకిలో ఊరేగించారు. గ్రామంలోని ప్రతి ఇంటి ముందూ మహిళలు రంగవల్లికలను వేసి స్వామివారికి స్వాగతం పలికారు. ఈ వేడుకను వందలాది మంది భక్తులు వీక్షించి, గోవింద నామస్మరణ చేశారు. బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సింహ వాహనసేవ నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 




బ్రహ్మోత్సవాలకు రారండి..!

ముక్కోటి దేవతలకు హనుమంతుడి ఆహ్వానం

కదిరి, ఫిబ్రవరి 10: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ముక్కోటి దేవతలకు హనుమంతుడు ఆహ్వానం పలికాడు. ఈ వేడుకలో భాగంగా పట్టణంలోని శ్రీవారి ఆలయంలో గురువారం ప్రాకారోత్సవం నిర్వహించారు. హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. మధ్వనవమి సందర్భంగా మాఘ శుద్ధ నవమి, రోహిణీ నక్షత్రంలో ఈ ఉత్సవం నిర్వహించారు. ఏటా శ్రీవారి కల్యాణోత్సవానికి నెలరోజుల ముందు ఈ వేడుక జరిపిస్తారు. ఆలయ సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌, ఉభయదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-02-11T06:12:33+05:30 IST