రజకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
ABN , First Publish Date - 2022-11-26T23:57:21+05:30 IST
రజకులు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా రాణించాలం టే తల్లిదండ్రులు పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని టీడీపీ రజక సాధికార స మితి రాష్ట్ర కమిటీ డైరెక్టర్ రామచంద్ర పిలుపునిచ్చారు.
టీడీపీ రజక సాధికార సమితి రాష్ట్ర కమిటీ డైరెక్టర్ రామచంద్ర
గోరంట్ల, నవంబరు 26: రజకులు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా రాణించాలం టే తల్లిదండ్రులు పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని టీడీపీ రజక సాధికార స మితి రాష్ట్ర కమిటీ డైరెక్టర్ రామచంద్ర పిలుపునిచ్చారు. మండలంలోని వానవోలు గ్రా మంలో శనివారం రజక సంఘం మండలాధ్యక్షుడు గణేష్ ఆధ్వర్యంలో రజకుల స మావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రామచంద్ర మాట్లాడుతూ, విద్యతో నే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని రజకులు గుర్తించాలన్నారు. ఈసందర్భంగా రజ క సంఘం వానవోలు పంచాయతీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడిగా రంగనాథం, ఉపాధ్యక్షుడిగా మునెప్ప, కార్యదర్శిగా రవికుమార్, సహాయ కార్యదర్శిగా లక్ష్మీనరసమ్మ, కోశాధికారిగా లక్ష్మీనారాయణ(లచ్చి), కార్యవర్గ సభ్యులుగా సుబ్బరాయుడు, సురేష్, శంకర, ఓబులేసు, రమేష్, రత్నమ్మ, అంజినమ్మ, ఓబులేసు, చిన్న ఓబులేసును నియమించారు. కార్యక్రమంలో రజక సం ఘం నాయకులు గణేష్, శ్రీరాములు, సత్యం, ఆదినారాయణ, ఉత్తప్ప, వెంకటేశ, గం గాద్రి, అభి, నాగరాజు, నాగమణి, కండెక్టర్ నారాయణప్ప, వెంకటనారాయణ, శ్రీనివాసులు, రఘు, రజక కులస్థులు పాల్గొన్నారు.