టిడ్కో గృహాల రిజిసే్ట్రషన్లకు క్యూ

ABN , First Publish Date - 2022-08-17T05:13:04+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన టిడ్కో గృహాల నిర్మాణం 60 శాతం పూర్తి కావడంతో.. వాటిని రిజిస్ర్టేషన చేయించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం సూచించారు.

టిడ్కో గృహాల రిజిసే్ట్రషన్లకు క్యూ
కిక్కిరిసిన రిజిసే్ట్రషన కార్యాలయం

అందరూ ఒకేసారి రావడంతో ఇబ్బందులు.. ముందుచూపు లేకపోవడంతో సాగని ఇతర రిజిసే్ట్రషన్లు

హిందూపురం అర్బన, ఆగస్టు 16 : గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన టిడ్కో గృహాల నిర్మాణం 60 శాతం పూర్తి కావడంతో.. వాటిని రిజిస్ర్టేషన చేయించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం సూచించారు. దీంతో  లబ్దిదారులు, వారితోపాటు సాక్షులు, బం ధువులు అందరూ ఒకేసారి రావడంతో రిజిస్ర్టేషన కార్యాలయం మంగళవారం కిక్కిరిసింది. సాధారణంగా రోజూ 40 నుంచి 50 దాకా రిజిస్ర్టేషన్లు జరిగేవి. ఒక్కరోజే టిడ్కో ఇళ్లకు సంబంధించి వందదాకా రిజిస్ర్టేషన్లు జరిగాయి. దీంతో ఇతర రిజిస్ర్టేషన్ల కోసం వచ్చినవారు పనులు కాక తీవ్ర అసహనానికి గురయ్యారు.  టిడ్కో ఇళ్ల రిజిస్ర్టేషన విషయని వారు బెంగళూ రు, ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చి  రిజిస్ర్టేషన్లు కాక  ఇబ్బందులు పడ్డారు. చలానాలు కట్టి ఇంత దూరం వచ్చాక రిజిస్ర్టేషనలు జరగకపోవడంతో మరోసారి రావాలంటే వ్యయ ప్రయాసలు, సమయం వృథా అవుతుందని  ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులు, ముసలివాళ్లను మళ్లీ రిజిస్ర్టేషనకు తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం టిడ్కో ఇల్లు ఒకేసారి రిజిస్ర్టేషన కాకుండా విడతల వారిగా, లేదా వార్డులవారీగా నిర్వహించి ఉంటే బాగుండేదని అంటున్నారు. కాగా, రిజిస్ర్టేషన్లకు వచ్చినవారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Updated Date - 2022-08-17T05:13:04+05:30 IST