ఐదుగురికి శిక్ష.. కొందరికి రక్ష..!

ABN , First Publish Date - 2022-12-31T00:37:25+05:30 IST

అధికార పార్టీ అండ ఉంటే అక్రమాలకు పాల్పడినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా పెద్దగా చర్యలు ఉండవు. కానీ అధికార పార్టీవారి అనుగ్రహం లేకుంటే ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. శింగనమల కేజీబీవీలో పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. బాధ్యులపై జిల్లా ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెండు రోజులు విచారించిన అధికారులు.. శుక్రవారం

ఐదుగురికి శిక్ష.. కొందరికి రక్ష..!
శింగనమల కేజీబీవీ

శింగనమల కేజీబీవీ ఘటనపై తీర్పు

అధికార పార్టీ ఆశీస్సులున్న వారికి బదిలీలు

జీసీడీఓ విభాగం వైఫల్యంపై చర్యలు శూన్యం

అనంతపురం విద్య, డిసెంబరు 30: అధికార పార్టీ అండ ఉంటే అక్రమాలకు పాల్పడినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా పెద్దగా చర్యలు ఉండవు. కానీ అధికార పార్టీవారి అనుగ్రహం లేకుంటే ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. శింగనమల కేజీబీవీలో పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. బాధ్యులపై జిల్లా ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెండు రోజులు విచారించిన అధికారులు.. శుక్రవారం ‘తీర్పు’ ఇచ్చారు. సిబ్బందిలో ఐదుగురిని విధుల నుంచి తొలగించామని కలెక్టర్‌, ఏపీసీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్‌ కుక్‌ పుల్లమ్మ, నైట్‌ వాచ ఉమెన రాజమ్మ, ఏఎనఎం భాగ్యలక్ష్మి, అటెండర్‌ అంజనమ్మ, డే వాచ ఉమెన పద్మావతిని విధుల నుంచి తొలగించారు. అకౌంటెంట్‌ రమాదేవిని, అసిస్టెంట్‌ కుక్‌ రమాదేవిని అడ్మినిస్ట్రేటివ్‌ గౌండ్స్‌ కింద మరో కేజీబీవీకి బదిలీ చేశారు.

రెండు రోజుల విచారణ

శింగనమల కేజీబీవీలో ఈ నెల 2న ఫుడ్‌ పాయిజన కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 80 మంది ఆస్పత్రిపాలయ్యారు. రెండోసారి ఈ నెల 23న ఫుడ్‌ పాయిజన అయింది. 40 మంది దాకా ఆస్పత్రిపాలయ్యారు. ఈసారి మజ్జిగలో బల్లి పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఓ పోలీస్టేషనలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇనచార్జ్‌ డీఈఓ వెంకటక్రిష్ణారెడ్డి, ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌ రెండు రోజులపాటు విచారించారు. తొలిరోజు ఉద్యోగులను పోలీసు భద్రత నడుమ విచారించారు. రెండో రోజు జిల్లా సైన్స సెంటర్‌లో ఉద్యోగులను పలుమార్లు విచారించారు. కొందరు విద్యార్థులను కూడా విచారించారు.

వైసీపీ నేతల కనుసన్నల్లో..

కేజీబీవీ ఘటనపై అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే అధికారులు చర్యలు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోని ఓ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు కొందరిపై చర్యలు తీసుకుని, మరికొందరిని రక్షించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అటెండర్లు, డే అండ్‌ నైట్‌ వాచ ఉమెన్లు, ఏఎనఎం, ఒక అసిస్టెంట్‌ కుక్‌ను ఏకంగా విధుల నుంచి తొలగించారు. అకౌంటెంట్‌, మరో అసిస్టెంట్‌ కుక్‌ను బదిలీ చేసి వదిలేశారు. ఒకే నెలలో రెండు సంఘటనలు జరిగితే.. సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఆ విభాగం చూసే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వందలాది మంది విద్యార్థినులు రెండుసార్లు ఆసుపత్రి పాలైనా... జీసీడీఓ విభాగం అధికారులు నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్‌, సమగ్రశిక్ష ప్రాజెక్టు రాష్ట్రస్థాయి అధికారులు మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2022-12-31T00:39:35+05:30 IST