ప్రతిష్టాత్మకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు : టీడీపీ

ABN , First Publish Date - 2022-09-27T06:04:37+05:30 IST

రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకుని, టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మె ల్యే, నియోజకవర్గ పార్టీ ఇన చార్జి మద్దనకుంట ఈరన్న పిలుపునిచ్చారు.

ప్రతిష్టాత్మకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు : టీడీపీ
ఓటరు నమోదు పత్రాలు అందజేస్తున్న నాయకులు

మడకశిరటౌన, సెప్టెంబరు 26: రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకుని, టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపునకు   కృషి చేయాలని మాజీ ఎమ్మె ల్యే, నియోజకవర్గ పార్టీ ఇన చార్జి మద్దనకుంట ఈరన్న పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డితో కలిసి పార్టీ నా యకులు, కార్యకర్తలతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన అరాచకాలకు అంతులేకుండా పోతోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాన్నారు. త్వ రలో జరిగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థిని గె లిపించి టీడీపీ సత్తా చాటాలని కోరారు. డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులను ఓటరు జా బితాలో చేర్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. సమావేశంలో ఐ-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత, రాష్ట్ర వక్కలిగ సాధికార సమితి కన్వీనర్‌ వీఎం పాండురంగ ప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌, మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వర్థరామప్ప, రామకృష్ణ, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్రనరసింహ, అధికార ప్రతినిధి జయరామరెడ్డి, రాజగోపాల్‌, కన్వీనర్‌ రామాంజనేయులు పాల్గొన్నారు. 


Read more