గుంతల రోడ్లు.. శిథిలమైన మురుగు కాలువలు

ABN , First Publish Date - 2022-09-26T05:18:44+05:30 IST

పట్టణంలోని 8, 9 వార్డు పరిధి లోని దర్గాపేట, ఉప్పర వాడలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వీ ధుల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు.

గుంతల రోడ్లు.. శిథిలమైన మురుగు కాలువలు
గోతులమయమైన దర్గావీధి రోడ్డు

పెనుకొండ, సెప్టెంబరు 25: పట్టణంలోని 8, 9 వార్డు పరిధి లోని దర్గాపేట, ఉప్పర వాడలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వీ ధుల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా మారి  ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. మురికి కాలువలు శిథిలయ్యాయి. మురుగు ముందుకుపోక, రోడ్డెక్కుతోంది. ఇళ్ల ఎదుట దుర్గంధంతో జనం అ ల్లాడుతున్నారు. దోమలు అధికమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇరుకు సందులు, వాటికితోడు రోడ్లు గుంతలు పడి పాదచారులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరినైనా ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే ఆటోలు కూడా సందుల్లోకి రాలేకపోతున్నాయి.  గ్యాస్‌ వాహనాలు వీధుల్లోకి రాకపోవడంతో దూరంగా ఆపుతున్నారు. సమస్యలను పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. 


Read more