చెరువులు ఫుల్ - సాగు నిల్
ABN , First Publish Date - 2022-11-21T23:59:10+05:30 IST
గత యేడాది నుంచి కురిసిన భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌లు నీటితో కళకళలాడుతు న్నాయి. చెరువుల్లో నీరు నిండుగా ఉన్నా, ఆయకట్టు భూములు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.
బీడుగా ఆయకట్టు భూములు
పెట్టుబడి భారంతో సాగుకు ముందుకురాని రైతులు
అమడగూరు, నవంబరు 21: గత యేడాది నుంచి కురిసిన భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌లు నీటితో కళకళలాడుతు న్నాయి. చెరువుల్లో నీరు నిండుగా ఉన్నా, ఆయకట్టు భూములు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. చెరువు నుంచి పొలాలకు నీరు పోవడానికి సరైన కాలువలు లేకపోవడంతో పొలాలకు నీరుచేరడంలేదు. అలాగే ఆయకట్టు భూములన్నీ ముళ్ల కంపలతో దర్శనమిస్తున్నాయి. ఈ కారణాల వల్ల భూములను సాగుచేయడానికి రైతులు ముందుకురావడంలేదు, పంటలు సాగుచేయడాలంటే అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని అంటున్నారు. ఎకరా భూమిలోని ముళ్ల కంపలను తొలగించా లంటే దాదాపు రూ.20వేలు ఖర్చు వస్తుంది. వరి పంటను ఎకరా సాగుచేయాలంటే రూ. 50 నుంచి రూ. 60వేలు దాకా ఖర్చు అవుతుందని చెబున్నారు. ఒకప్పుడు చెరువులు నిండితే చాలు ఇంటిల్లి పాది వ్యవ సాయ పనుల్లో నిమగ్నమై ఆయకట్టుభూములు పచ్చగా కళకళలా డుతుండేవి. పెట్టుబడుల భారంతో నేడు చెరువులు నిండి నా ఆయకట్టు పంట పొలాలతో కాకుండా అడవులను తలపిస్తు న్నాయి. దీంతో బాటు పలు చె రువుల కట్టలు నెర్రెలు బారాలు. తూములు ముళ్ల కంపచెట్లతో నిండిపోయాయి. దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందో అని రైతులు భయాందోళనకు గురవు తున్నారు. అంతేగాకుండా కంప చెట్లతో ఉన్న ఎకరా పొలాన్ని చదును చేసి, సాగు చేయడానికి దాదాపు రూ.70వేలు నుంచి రూ.80వేలకు పైగా ఖర్చువస్తుం దని భయపడుతున్నారు. తీరా పంట చేతికొచ్చేసమయానికి వర్షాలు అధికంగా వస్తే పంట నీటిపాలవుతుందని, మళ్లీ అప్పులు, నష్టాల బారిన పడాల్సి వస్తుందని ఆం దోళన వెలిబుచ్చుతున్నారు. దీంతో వరి సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదం టున్నారు. ఇరిగేషన అధికారు లు చెరువు కట్టలు, కాలువల మరమ్మతులు చేపడితే రైతులకు కొంత వరకు అనుకూలంగా ఉంటుంద ంటున్నారు. దీంతో కొంతవరకు రైతులు వరి పంట సాగుకు మొగ్గు చూపే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
చెరువుల మరమ్మతుకు నివేదికలు పంపాం - మహేష్, ఇరిగేషన ఏఈ
మండలంలోని ప్రధానచెరువుల మరమ్మతుల కోసం నివేదికలు పంపాం. ప్రస్తుతం నిధుల కొతరతో మరమ్మతులు చేపట్టలేకపోతు న్నాం. నిధులు విడుద లైన వెంటనే చెరువులో నెలకున్న సమస్యలతో పాటు కాలువుల మరమ్మతులు చేపడతాం.