పనిచేయని పోలీసు లాక్‌

ABN , First Publish Date - 2022-05-24T05:45:36+05:30 IST

వేసవి సెలవులు వచ్చాయంటే చాలామంది ఉద్యోగులు, ఇతరులు.. స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్తారు.

పనిచేయని పోలీసు లాక్‌

ఎల్‌హెచఎంఎస్‌ యాప్‌ డౌనలోడ్‌కే పరిమితం

అవగాహన కల్పించడంలో విఫలం

సెలవుల్లో చోరీలకు ఆస్కారం


హిందూపురం టౌన 


వేసవి సెలవులు వచ్చాయంటే చాలామంది ఉద్యోగులు, ఇతరులు.. స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్తారు. ఆ తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేస్తూ దొంగలు చోరీలకు పాల్పడే ఆస్కారం ఉంది. వీటికి చెక్‌ పెట్టేందుకు ఏపీ పోలీసు శాఖ 2017లో ప్రవేశపెట్టిన లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచఎంఎ్‌స) లక్ష్యం నెరవేరలేదు. చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తొలిరోజుల్లో ఎల్‌హెచఎంఎస్‌పై పోలీసు శాఖ పెద్దఎత్తున ప్రచారం చేపట్టింది. అప్పట్లో కొన్నిచోట్ల దీని నుంచి ప్రయోజనాలు కూడా వచ్చాయి. రాను రాను పోలీసు శాఖ ఈ యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు.


ఆరంభ శూరత్వమేనా..?

పెనుకొండ సబ్‌డివిజన పరిధిలో అప్పట్లో ఉన్న డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌ లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టంను పకడ్బందీగా అమలు చేశారు. అప్పట్లో హిందూపురం పట్టణంలో వేసవి సెలవుల్లో చోరీలకు వచ్చిన దొంగలు రెండు చోట్ల వెనక్కెళ్లారు. మరో రెండు చోట్ల చోరీకి ప్రయత్నించిన దుండగులను పట్టుకున్నారు. రానురాను దీనిపై ప్రచారం గాలికొదిలేశారు. ప్రజలు తమ సెల్‌ఫోన, మొబైల్‌లో యాప్‌ను డౌనలోడ్‌ చేయించడంతోపాటు వినియోగించేలా అప్పట్లో చేశారు. ఈ విధానం చోరీలకు అడ్డుకట్ట వేయడంలో సఫలీకృతమయ్యారు.


డౌనలోడ్‌కే పరిమితం

పెనుకొండ సబ్‌డివిజన పరిధిలో ఎల్‌హెచఎంఎ్‌స యాప్‌ను ప్రారంభించి, అప్పట్లో ఈయా్‌పను సబ్‌డివిజన వ్యాప్తంగా సుమారు 10వేల మంది మొబైల్‌ ఫోన్లలో డౌనలోడ్‌ చేసుకునేవిధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పోలీసులు దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణం.


ఉపయోగాలివీ...

పోలీసులు ప్రవేశపెట్టిన ఎల్‌హెచఎంఎస్‌ యాప్‌ ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలో చోరీలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది. ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లాల్సిన సమయంలో యాప్‌ ద్వారా ప్రజలు.. పోలీసులకు వినతిపత్రం అందిస్తే సంబంధిత ఇళ్లకువచ్చి సెన్సార్‌ కెమెరాలు బిగిస్తారు. ఆ తరువాత కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. ఇళ్లలోకి దొంగలెవరైనా ప్రవేశిస్తే వెంటనే కంట్రోల్‌రూమ్‌కు మెసేజ్‌ వస్తుంది. వెంటనే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, చోరీని అరికట్టవచ్చు. ఎప్పటికప్పుడు దీనిని ఆపరేట్‌ చేయడానికి అప్పట్లో మూడు బృందాలను ఏర్పాటు చేశారు.


ఆ కెమెరాలు మూలకు..

పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ యాప్‌ 2021 నుంచి మూలనపడింది. ఎల్‌హెచఎంఎ్‌సకు సంబంధించి సిమ్‌కార్డులకు రీచార్జ్‌లు చేయలేదు. మరికొన్ని పరికరాలు పనిచేయలేదు. దీనికితోడు సిబ్బంది కొరత ఉంది. హిందూపురం పట్టణానికి అప్పట్లో ఎనిమిది కెమెరాలు అందజేశారు. ప్రస్తుతం అవి మూలనపడ్డాయి. ఇప్పటికైనా వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే చోరీలను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు


అవగాహన కల్పిస్తాం..- రమ్య, డీఎస్పీ

ఎల్‌హెచఎంఎ్‌స యాప్‌ను ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ ఇంటి వివరాలు, సంబంధిత పోలీసు స్టేషనలో అందజేయాలి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఎల్‌హెచఎంఎస్‌ అమలుపై చర్చిస్తాం.

Read more