వైసీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

ABN , First Publish Date - 2022-12-15T23:53:14+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని టీడీపీ 19వ వార్డు ఇనచార్జ్‌ చంద్రకళ పేర్కొన్నారు.

వైసీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

టీడీపీ నాయకులు

ధర్మవరం, డిసెంబరు 15: వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని టీడీపీ 19వ వార్డు ఇనచార్జ్‌ చంద్రకళ పేర్కొన్నారు. చంద్రకళ ఆధ్వర్యంలో గురువారం 19వ వార్డులో బాలయ్య అభిమానులు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రజావ్యతిరేక విఽధానాలను వివరించారు. దోచుకోవడం దాచు కోవడం వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకువేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అవసరం ఎంతో ఉంద న్నారు. ఈ సందర్భంగా మిస్‌డ్‌కాల్‌ ఇప్పించే కార్యక్రమం చేపట్టారు.

ధర్మవరంరూరల్‌: వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా సిమెంట్‌ రోడ్లు లేక వర్షపునీరు నిలిచి బురదమయంగా మారాయని టీడీపీ మండల నాయకులు పేర్కొ న్నారు. ఇదేంఖర్మ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని ము చ్చురామి, సీతారంపల్లిల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటా తిరిగారు. ప్రజలసమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రధానకార్యదర్శి విజయసారథి, ముచ్చురామిక్రిష్ట, రాంపురంశీన, బడన్నపల్లి క్రిష్ట, రామాంజి, సీతారంపల్లి తాతిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, పోతులనాగేపల్లి నరేష్‌, తేజ, వీరనారప్ప, పల్లెప్ప, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

కదిరి: పట్టణంలోని 11వార్డులో గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 11వార్డులో మురుగునీటికాలువలు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రోడ్లుపైనే మురుగు ప్రవహిస్తున్నా పట్టించుకునేవారు లేరన్నారు. నిరుపేదలుండే ఈవార్డులో అభివృద్ధి కనిపించలేదన్నారు. ఏ ఇంటికి పోయినా సమస్యలు ఏకరువుపెడుతున్నట్లు చెప్పారు. ఈప్రభుత్వానికి కూల్చివేతలు తప్ప అభివృద్ది పట్టలేదన్నారు. ఈప్రభుత్వం మారితేకానీ, ప్రజలు కష్టాలు తీరవన్నారు. ఈకార్యక్రమంలో 11వార్డు ఇనచార్జ్‌ పట్నం దిల్‌దార్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ ఇర్షాన, ఎస్సీసెల్‌ రాష్ట్ర నాయకులు రాజశేఖర్‌బాబు, మైనార్టీ నాయకురాలు పర్వీనబాను, కౌన్సిలర్‌ ఆల్ఫాముస్తఫా, క్లస్టర్‌ ఇనచార్జ్‌ రెడ్డిబాషా, పీట్ల రమణమ్మ, రాజేంద్ర నాయుడు, మాజీ కౌన్సిలర్‌ ఖాదర్‌ బాషా, రామచంద్ర, షాకీర్‌, విశ్వనాథ్‌, ప్రకాష్‌ కతాబ్‌,సులేమాన, గంగ రత్నమ్మ, శారద తదితరులున్నారు. సున్నపుగుట్టతండాలో నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోపూరి శెట్టి చంద్రశేఖర్‌, భార్గవ, ప్రేమలత, నరేష్‌, వినయ్‌కుమార్‌, నాగేంద్రనాయక్‌, రామాంజనేయులు, మునీంద్రనాయక్‌, దేవేంద్రనాయక్‌, కదిరప్ప, ఆంజనేయులు, శిల్పం రమేష్‌, రామాంజి, రాజశేఖర్‌, జయచంద్ర, రామాంజనేయులు తదితరులున్నారు.

Updated Date - 2022-12-15T23:53:18+05:30 IST