పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టండి
ABN , First Publish Date - 2022-05-27T06:09:23+05:30 IST
పరిశ్రమల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల ప్ర యాణానికి ఇబ్బందిగా మారిందని ఓ రైలు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు.

ఓ రైలు ప్రయాణికుడి ఫిర్యాదు
పరిశీలించిన అధికారులు
రెండు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
యాడికి, మే 26: పరిశ్రమల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల ప్ర యాణానికి ఇబ్బందిగా మారిందని ఓ రైలు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. యాడికి మండలపరిధిలోని రాయలచెరువు గ్రామం నుంచి పెద్దవడుగూరు మండలపరిధిలోని కిష్టిపాడు వరకు రైలుపట్టాలకు ఆనుకుని పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వాటి నుంచి కాలుష్యం ఎక్కువైందని చర్యలు చేపట్టాలని పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు అధికారులు ట్రాన్స్‌కో అధికారులను ఆశ్రయించడంతో మండల వ్యాప్తంగా తీవ్రచర్చ జరుగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పలు పరిశ్రమలను పరిశీలించి వాటిపై చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది. సదరు పరిశ్రమల యజమానులు వారి ఆదేశాలను ఖాతరు చేయకపో వడంతో ట్రాన్స్‌కో ఎస్‌ఈ ద్వారా ఆ పరిశ్రమలకు కరెంట్ సరఫరా నిలిపివే సేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. దీనిపై యాడికి మండల పరిధిలో ఉన్న ఆరు పరిశ్రమలపై ట్రాన్స్‌కో అధికారులు చర్యలకు ఉపక్ర మించి రెండు పరిశ్రమలకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. మిగిలిన నలుగురు యజమానులు గడువు కోరినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.