మహోన్నత నాయకుడు పరిటాల రవి

ABN , First Publish Date - 2022-01-25T05:34:23+05:30 IST

మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటా ల రవీంద్ర మహోన్నతమైన నేత అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

మహోన్నత నాయకుడు పరిటాల రవి
గుత్తిలో పరిటాల రవి చిత్రపటం ఎదుట నివాళులర్పిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌

ఊరూరా వర్ధంతి సభలు

ఘన నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు


గుంతకల్లు, జనవరి 24: మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటా ల రవీంద్ర మహోన్నతమైన నేత అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లావ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులర్పించారు. పలుచోట్ల అన్నదానం చేశారు. గుంతక ల్లు టీడీపీ కార్యాలయంలో పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాటాడుతూ పరిటాల జీ వితం యావత్తూ పోరాటాల మయమని, అన్యాయాలను ఎదురొడ్డి పోరాడి న, ప్రాణాలర్పించిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాయల రామయ్య, టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశులు, కార్యదర్శి ఆ టో ఖాజా, నాయకులు హనుమంతు, తలారి మస్తానప్ప, చికెన జగన, పో తప్పగారి శీన, ఫజులు, రామన్న చౌదరి పాల్గొన్నారు. 


కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో.. 

గుంతకల్లు పట్టణంలోని కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో రవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పరిటాల రవి అనన్య సా మాన్యమైన నేత అని, అయిన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమ్మ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తమ్మినేని రమేశ, గుంతకల్లు కార్యదర్శి టీ పవనకుమార్‌, దబ్బర నారాయణ, అల్లు శ్రీనివాసులు, శ్రీ కాంత, ఆదినారాయణ, నరేంద్ర నాయుడు పాల్గొన్నారు.


గుంతకల్లు టౌన: టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌ ఆధ్వర్యం లో పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ డుగు, బలహీన వర్గాల అభ్యునతికి పరిటాల రవి ఎనలేని కృషి చేశారన్నా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేసీ రామాంజనేయులు, గాలి మల్లికార్జున, సంజీవరాయుడు, లక్ష్మీనారాయణ, కోడి శీన, మునయ్య, బీఎస్‌ శ్రీధ ర్‌, బొట్టు కుళ్లాయప్ప, అశోక్‌, రాయపాటి విశ్వనాథ్‌, బెస్త శ్రీరాములు, చాం ద్‌, మహేష్‌, అంజి, నారాయణ పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని పరిటాల రవి కల్యాణ మండపంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు తమ్మినేని రమేష్‌, పవనకుమార్‌, అల్లు శ్రీనివాసులు, దబ్బర నారాయణ, శ్రీ కాంత, ఆదినారాయణ చౌదరి, మధుసూదన, చింబిలి నరేంద్రనాయుడు,  బొజ్జా రాజేష్‌, తమ్మినేని రంగా పాల్గొన్నారు.


గుత్తి: పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ ఆధ్వర్యంలో పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి పరిటాల రవి అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ సుంకన్న, నాయకులు నరేంద్రచౌదరి, వెంకట శివుడు, ఆదినారాయణ, నంద్యాల రం గారెడ్డి, శీన, పవన, రమణు పాల్గొన్నారు. అలాగే టీడీపీ మండల కన్వీనర్‌ బర్దీవలి ఆధ్వర్యంలో పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి దిల్‌కా శీన, అబ్దుల్‌ జిలాన, కృష్ణా, మాజీ ఎంపీపీ వీరభద్రయ్య, నాయకులు కేశవ నాయుడు, సుధాకర్‌, సుంకన్న, నిజామ్‌, మల్లయ్య, పులికొండ పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం: దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఆశయ సాధనకు కృషి చేద్దామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట పరిటాల రవీంద్ర చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ భూస్వాముల దౌర్జన్యాలకు ఎదురొడ్డి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పరిటాల ఎన్నోత్యాగాలు చేశారని కొనియాడారు. కార్యక్రమం లో నాయకులు దొడగట్ట నారాయణ, మురళి, తలారి సత్యప్ప, రామరాజు,పోస్టు పాలన్న, శ్రీరాములు, కొల్లప్ప, బోర్ల రామన్న, బిక్కి జయరాములు, ఓ బుళాపురం తిమ్మప్పయాదవ్‌, మొద్దుల వెంకటేశులు, వేలూరి అరవింద్‌, బ్రి జేష్‌, నాగరాజు, హరి, రోషన, రామాంజనేయులు, కోటప్ప పాల్గొన్నారు. 


 అదేవిధంగా కళ్యాణదుర్గం ఎన్టీఆర్‌ భవన వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు లు ఉన్నం హనుమంతరాయ చౌదరి, సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన చౌదరి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మినారాయణచౌదరి, అనంతపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు వైపీ రమే్‌షలతో కలిసి పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించు కుని చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉన్నం మాట్లాడుతూ పరిటాల రవీంద్ర రైతుల పక్షపాతిగా, ఎమ్మెల్యే, మంత్రి హోదాలో ప్రజలకు అనేక సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్‌, పాపంపల్లి రామాంజనేయులు, గోళ్ల వెంకటేశులు, దురదకుంట సర్పంచు గరికపాటి అరుణసురేష్‌, రాజశేఖర్‌చౌదరి, ఆవుల తిప్పేస్వా మి, గాజుల శ్రీరాములు, ఊటంకి రామాంజనేయులు, గౌని శ్రీనివాసరెడ్డి, ఒంటిమిద్ది సత్తి, డీకే రామాంజనేయులు, హనుమంతరెడ్డి, వెలుగు లోకేష్‌, శివన్న, తిమ్మరాజులు, కొల్లాపురప్ప, గొర్ల గోవిందు, కుణే సాయినాథ్‌ పాల్గొన్నారు.


బొమ్మనహాళ్‌: పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లు పం పిణీ చేశారు. నాయకులు సంగప్ప, శంకర్‌, వెంకట కృష్ణ మాట్లాడుతూ ప రిటాల ఆశయ సాధన కోసం  కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


పామిడి: పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని టీడీపీ సీనియర్‌ నాయకులు అప్పన్నగారి కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పరిటాల పేదల పాలిట పె న్నిధి అన్నారు. కార్యక్రమంలో పరిటాల అభిమానులు రామాంజనేయులు, వీరాంజి, శివ, లోకేష్‌ పాల్గొన్నారు.


కంబదూరు: పేదల అభ్యునతి కోసం నిరంతరం కృషిచేసిన పరిటాలరవి ఆశయసాధనకు ప్రతిఒక్కరు పాటుపడాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహనచౌదరి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అ మిలినేని లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద పరిటాల రవి చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు గాజుల శ్రీరాములు, శివన్న, తలారి ఎర్రిస్వామి, తిమ్మరాయుడు, సుధాకర్‌, గంగిరెడ్డి, ముత్యాలు, వెంకటేష్‌, హనుమంతరాయుడు, శీన, నరేష్‌, మల్లికార్జున, హేమంత, రాజ పాల్గొన్నారు. 

 

తాడిపత్రి టౌన/యాడికి: పేదలపెన్నిధి పరిటాల రవీంద్ర అని మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్‌ మాదాల అనిల్‌కుమార్‌ అన్నారు. స్థానికంగా పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మదమంచి శివ, పరిమి చరణ్‌, నెట్టికంటయ్య, శేఖర్‌, శ్రీహరి, మెకానిక్‌ బాబు, నరేంద్రబాబు, జాఫర్‌, గుర్రప్ప, రామానాయుడు, రమేష్‌, శ్రీధర్‌, నాగరాజుగౌడ్‌, నారాయణస్వామి  పాల్గొన్నారు. అదేవిధంగా తాడిపత్రి మండల ఆవులతిప్పాయపల్లి భగవాన శ్రీరమణ మహర్షి అనాథపిల్లల ఆశ్రమంలో పరిటాల రవీంద్ర వర్ధంతిని పు రస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్యాణ చక్రవర్తి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-01-25T05:34:23+05:30 IST