మరోసారి గాలి మరల వివాదం

ABN , First Publish Date - 2022-09-26T05:09:09+05:30 IST

నియోజకవర్గంలోని గాలిమరల కంపెనీకి ఇచ్చిన అద్దె వాహనాల కాంట్రాక్టు కొనసాగింపు విషయంగా వైసీపీ నాయకులు మరలా హల్‌చల్‌ సృష్టించారు.

మరోసారి గాలి మరల వివాదం



అద్దె వాహనాల విషయమై ఘర్షణ


గుంతకల్లు, సెప్టెంబరు 25:  నియోజకవర్గంలోని గాలిమరల కంపెనీకి ఇచ్చిన అద్దె వాహనాల కాంట్రాక్టు కొనసాగింపు విషయంగా వైసీపీ నాయకులు మరలా హల్‌చల్‌ సృష్టించారు. వైసీపీలోని విశ్వేశ్వరరెడ్డి వర్గానికి చెందిన వారి అద్దె వాహనాలు కండిషన సరిగా లేవని, వారిని మార్చాలని సంస్థ తెలపగా, పట్టించుకోకపోవడంతో వాహనాలను కాంటా్ట్రక్టు నుంచి తొలగిం చించినట్లు సమాచారం. ఈ కారణంగా వైసీపీ నాయకులు గాలి మరల కంపెనీ కంటైనర్ల ఆఫీసు వద్ద దాడికి పాల్పడ్డారు. మూడు రోజుల కిందట నింబగల్లులో రెన్యూ పవర్‌ పేరిట ఓసో్ట్ర అనంతపురం ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పవన విద్యుత సబ్‌ స్టేషన సమీపంలోని కంటైనర్‌ ఆఫీసు వద్ద విశ్వేశ్వర రెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి, మరి కొందరు అనుచరులు భయోత్పాతం సృష్టించారు. పవర్‌ టర్బైన్లను నిలిపివేసి, సామగ్రిని ధ్వంసం చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీనిపై కంపెనీకి చెందిన సేఫ్టీ అధికారి శ్రీనివాసులు 23వ తేదీన ఉరవకొండ పోలీసు స్టేషనలో ఫిర్యాదుచేసి, కంపెనీ యాజమాన్యం సూచనల మేరకు అనంతపురానికి వెళ్లి ఎస్పీకి కంప్లయింట్‌ చేశారు. విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసు కెళ్లినట్లు సమాచారం. కాగా ఇరుపక్షాల వారిని స్టేషనుకు పిలిపిం చిన ఉరవకొండ పోలీసులు విచారించగా, రాజీపడినట్లు సమాచారం


గతంలోనూ ఇలాగే..

గత సంవత్సరం కూడా ఇలాగే గాలి మరల కంపెనీకి ఇచ్చే అద్దె వాహనాల విషయంగా వైసీపీ నాయకులు సీన సృష్టించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని పీసీ ప్యాపిలి వద్ద ఉన్న సుజలాన సంస్థకు అద్దె వాహనాల విషయంగా వైసీపీలోని విశ్వ, శివరామిరెడ్డి వర్గీయులు బలప్రదర్శనకు దిగారు. తమ వాహనాలనే అద్దెకు తీసుకోవాలంటూ గాలి మరల కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. విశ్వ వర్గీయులు, శివరామి రెడ్డి కుమారుడు భీమిరెడ్డి ఉరవకొండలో మకాం వేసి బాహాబాహీకి సిద్ధపడ్డారు. పోలీసులు పెద్ద ఎత్తున సిబ్బందిని మొహరించి పరిస్థితిని అదుపుచేశారు. చెరోదిక్కున ఉన్న రెండు వర్గాల వారితో మాట్లాడి సర్దిచెప్పి పంపించివేశారు. రెండేళ్ల కిందట కూడా బెళుగుప్ప మండలంలో దుద్దేకుంట వద్ద వాహనాల కాంట్రాక్టు విషయంగా ఆందోళన చేశారు. తాజాగా ఇప్పుడు నింబ గల్లు వద్ద అద్దె వాహనాల విషయంగానే వై విశ్వేశ్వరరెడ్డి వర్గీయులు కంపెనీ ఆఫీసుకు వెళ్లి గొడవ సృష్టించారు. తమ పార్టీ అధికారంలో ఉండటం ఇలా ఆర్థిక ప్రయోజనాల కోసం గొడవలకు దిగడం, భయోత్పాతాన్ని సృష్టించడం, పోలీసు స్టేషనలో కేసులు నమోదు కాకుండా చేయడం, గత్యంతరంలేక రాజీపడేలా చేయడం ఉరవకొం డలో వైసీపీ నాయకులకు పరిపాటిగా మారింది. 


Updated Date - 2022-09-26T05:09:09+05:30 IST