మామిడితోటలకు అందని ఉపాధి బిల్లులు

ABN , First Publish Date - 2022-10-09T05:13:49+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద పెంచుతున్న మామిడి తోటలకు రెండేళ్లుగా బిల్లులు అందకపోవడంతో... ఎప్పుడు అందిస్తారా... అని రైతులు ఎదురు చూస్తున్నారు.

మామిడితోటలకు అందని ఉపాధి బిల్లులు
ఉపాధి పథకం కింద సాగుచేసిన మామిడి మొక్కలు

 రెండేళ్లుగా రైతుల  ఎదురుచూపులు

గాండ్లపెంట, అక్టోబరు 8: ఉపాధి హామీ పథకం కింద పెంచుతున్న మామిడి తోటలకు రెండేళ్లుగా బిల్లులు అందకపోవడంతో... ఎప్పుడు అందిస్తారా... అని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో అత్యల్పంగా వర్షపాతం నమో దు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఉపాధి పథకం కింద దాదాపు 14 సంవత్సరాల క్రితం నుంచి మెట్ట భూముల్లో పండ్ల మొక్కల పెంపకానికి అనుమతిచ్చాయి. అప్పటి నుంచి సన్నచిన్నకారు రైతులకు ప్రభుత్వం మెట్ట భూముల్లో ఉపాధి పథకం ద్వారా గుంతలు తవ్వించి, మొక్కలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వాటి సంరక్షణ, ఎరువులు, నీటి సౌకర్యం కల్పించడానికి బిల్లులు అందించేది. ఈ ప్రకారం 2020-21లో దాదాపు 140మంది రైతులు 320 ఎకరాల్లో సాగుచేశారు. 2021-22కు గాను 54మంది రైతులు 111 ఎకరాల్లో మొక్కలు పెంపకం చేపట్టారు. రెండేళ్లుగా మొక్కల సంరక్షణకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. దాదాపు 194 మంది రైతులు 430 ఎకరాలకు గాను దాదాపు రూ.40లక్షల వరకు రైతులకు నీటిట్యాంకర్ల బిల్లులు అందాల్సి ఉంది. పలుమార్లు ఉపాధి సిబ్బందిని, ఏపీఓను ఎప్పుడు బిల్లులు అందిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఉపాధి హామీలో ప్రతినెల తాము మస్టర్లు వేస్తున్నామని, నిధులు రావడంలేదని వారు చెబుతు న్నారు. దీంతో మొక్కల సంరక్షణ కోసం నీటి బిల్లులు రెండేళ్లుగా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉపాధి పథకం కింద పండ్ల మొక్కల పెంపకం చేపట్టిన  రైతులకు ప్రభుత్వం బిల్లులు అందించాలని ఆ రైతులు కోరుతున్నారు. 

నిధులు విడుదలైతే 

బిల్లులు అందిస్తాం   - మంజునాథ్‌, ఏపీఓ

 రెండు సంవత్సరాలుగా రైతులు వివిధ ర కరాల పండ్ల మొక్కల పెంపకం చేపట్టారు. వాటికి  ప్రతినెల తాము మస్టర్లు వేసి బిల్లులకోసం ఆనలైనలో ఆప్‌లోడ్‌ చేస్తున్నాం. నిధులు రాక బిల్లులు పడలేదు. నిధులు విడుదలైతే పండ్లమొక్కల పెంపకం రైతుల ఖతాలో జమ అవుతాయి. 


Updated Date - 2022-10-09T05:13:49+05:30 IST