భక్తిశ్రద్ధలతో అమావాస్య పూజలు
ABN , First Publish Date - 2022-06-29T05:50:42+05:30 IST
పట్టణం లోని భక్త మార్కండే యస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అమావాస్య పూజలను భక్తిశ్రద్దల నడుమ నిర్వహించారు.

ధర్మవరం రూరల్, జూన 28: పట్టణం లోని భక్త మార్కండే యస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అమావాస్య పూజలను భక్తిశ్రద్దల నడుమ నిర్వహించారు. ఆల యంలో భద్రావతి భావనా నారాయణ స్వామికి, మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ విగ్ర హా లను ఉంచి వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ పద్మశాలీయ కులస్థులు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అన్నమయ్య సేవామండలి అధ్యక్షుడు పొరాళ్ల పుల్లయ్య ఆధ్వర్యంలో సభ్యులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో శ్రీపద్మశాలీయ బహూత్తమ సంఘం అధ్యక్షుడు జక్కా చిన్నసింగరయ్య, సభ్యులు పాల్గొన్నారు.