జాతీయ కర్రసాము పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-07T00:12:54+05:30 IST

ఆపద సమయంలో ఆత్మరక్షణకు యుద్ధ విన్యాసాలు ఎంతో ఉపయోగపడతాయని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు.

జాతీయ కర్రసాము పోటీలు ప్రారంభం

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 6: ఆపద సమయంలో ఆత్మరక్షణకు యుద్ధ విన్యాసాలు ఎంతో ఉపయోగపడతాయని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. నగర శివారులోని ఆర్డీటీ క్రీడా మైదానంలో 4వజాతీయ కర్రసాము పోటీలను మంగళవారం డీఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన యుద్ధకళల్లో ఒక్కటైన కర్రసామును ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎ్‌సఏ చీఫ్‌ కోచ వెంకటరమణ, స్టేడియం మేనేజర్‌ శ్రీదేవి, జాతీయ కర్రసాము అసోసియేషన వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రమోహన, అధ్యక్షుడు రోసిబాబు, ముక్కోటి అంబికా సేవాట్రస్టు డైరెక్టర్‌ శివ, ఆ సంఘం సభ్యులు నాగరాజు, వన్నూర్‌, వాణి, మౌనిక పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:12:56+05:30 IST