నాని.. నోరు అదుపులో పెట్టుకో!

ABN , First Publish Date - 2022-09-12T05:19:48+05:30 IST

‘కొడాలినాని.. నోరు అదుపులో పెట్టుకో, లేదంటే ఊరుకునేదిలేద’ంటూ చంద్రదండు వ్యవస్థాపకుడు, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన ప్రకా్‌షనాయుడు హెచ్చరించారు.

నాని.. నోరు అదుపులో పెట్టుకో!
మీడియాతో మాట్లాడుతున్న ప్రకా్‌షనాయుడు

కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

 చంద్రదండు ప్రకా్‌షనాయుడు ఫైర్‌ 


అనంతపురం అర్బన, సెప్టెంబరు 11: ‘కొడాలినాని.. నోరు అదుపులో పెట్టుకో, లేదంటే ఊరుకునేదిలేద’ంటూ చంద్రదండు వ్యవస్థాపకుడు, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన ప్రకా్‌షనాయుడు హెచ్చరించారు. ఆదివారం స్థానిక ఆయన స్వగృహంలో ప్రకా్‌షనాయుడు మీడియాతో మాట్లాడారు. ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే జగనకు తొత్తుగా మారి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పాదయాత్ర సమయంలో విజయమ్మ, షర్మిలను రోడ్లపై తిప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రోడ్డుపై వదిలేసిన హీనచరిత్ర జగనదేన్నారు. పదవులకు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో వస్తే మీబలమేంటో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. చంద్రబాబునాయుడు కుటుంబంపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానుకోకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని వదిలిపెట్టే రోజు వస్తుందని కొడాలి నానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రదండు సభ్యులు సుధాకర్‌, సురేష్‌, గౌషియా, నాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, దివాకర్‌నాయుడు,గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


మగాడివైతే తేల్చుకుందాం రా..! 

‘అధికారం, పోలీసులను అడ్డుపెట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడటం మగతనం కాదని, నువ్వు మగాడివైతే తేల్చుకుందాం రా..’ అంటూ కొడాలినానిపై టీఎనటీయూసీ జిల్లా అధికార ప్రతినిధి సిమెంట్‌ పోలన్న హెచ్చరించారు. ఆదివారం  అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళీ, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబంపై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులపై కారుకూతలు కూస్తే సహించేది లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళీ మండిపడ్డారు. 


మదమెక్కి మాట్లాడుతున్న నాని 

మంత్రిపదవి కోసం మదమెక్కి మాట్లాడితే భవిష్యత లేకుండా చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి  జేఎల్‌ మురళీధర్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రిపదవి పోయిన తర్వాత పిచ్చెక్కి, తాగిన మైకంలో సభ్యతా, సంస్కారం తెలియకుండా చంద్రబాబునాయుడు, నారాలోకేష్‌, వారి కుటుంబ సభ్యులపై నోటికి వచ్చినట్లు కొడాలినాని మాట్లాడుతున్నాడన్నారు. 60 లక్షలకుపైగా ఉన్న పసుపు దళాన్ని ఒక్క సారి గుర్తుకుతెచ్చుకొని, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలన్నారు. 


క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమిస్తాం :  తెలుగు యువత నిరసన

అనంతపురం అర్బన: నారా భువనేశ్వరికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని  తెలుగు యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంగి నాగ హెచ్చరించారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కొడాలి నాని ఫొటోతో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పదవి వస్తుందన్న చిల్లర ఆలోచనతో భువనేశ్వరిపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే చెప్పుతో దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత, టీడీపీ నాయకులు సిరిశాల రాంబాబు, పృథ్వీ, నరేంద్ర, కిరణ్‌, విద్యాసాగర్‌, నరేష్‌, అనిల్‌కుమార్‌, రాజేష్‌, శ్రీనివాసులు, సుధాకర్‌, శంకర్‌, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


పోలీసులకు ఫిర్యాదు

అనంతపురం అర్బన: మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడిన కొడాలినానిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడుపూటి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురం రూరల్‌ పోలీసు స్టేషనలో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబ సభ్యులపై కొడాలినాని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు నవీన, కృష్ణ, భరత, మురళీ, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more