ముక్కోటి ఏకాదశికి ఆలయాల ముస్తాబు
ABN , First Publish Date - 2022-01-13T06:21:15+05:30 IST
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామివారి ఆలయాన్ని వివిధ పుష్పాలు, రంగు కాగితాలతో అలంకరించారు.
కదిరి , జనవరి 12 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామివారి ఆలయాన్ని వివిధ పుష్పాలు, రంగు కాగితాలతో అలంకరించారు. గురువారం తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులకు ఉత్తర గోపురం ద్వారం వద్ద స్వామివారి దర్శనం ఉంటుం దని ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. ఆ మేరకు బుధవారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్‌లు ప్రత్యేకంగా పురుషులు, స్త్రీల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారె డ్డితో పాటు డీఎస్పీ భవ్యకిశోర్ పరిశీలించారు. ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు సత్యబాబు, రియాజ్, మధు, నిరం జన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
తాడిమర్రి: ముక్కొటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిం చేందు కు మండలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిడిగల్లులోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉత్తరద్వార ప్రవేశం స్వామి వారిని దర్శించుకో వడానికి ఈ ఏడాది నూతనంగా ఏర్పాటుచేశారు. అదేవిధంగా తాడిమర్రి చెన్నకేశ వస్వామి ఆలయంలో, అహోబిళ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిం చనున్నారు. ఏకపా దంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం 4గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు దర్శించుకున్న అనంత రం సాయంత్రం వేళ గ్రామంలో ఊరేగింపులు నిర్వహించనున్నారు.