అయ్యో.. పాపం..!

ABN , First Publish Date - 2022-10-02T05:28:33+05:30 IST

ఎవరో తెలియదు..! ఎవరు వదిలి వెళ్లారో తెలియదు..! జీవిత చరమాంకంలో ఉన్న ఈమెను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు.

అయ్యో.. పాపం..!
ఉంతకల్లు క్రాస్‌లో గుర్తుతెలియని వృద్ధురాలు

ఎవరో తెలియదు..! ఎవరు వదిలి వెళ్లారో తెలియదు..! జీవిత చరమాంకంలో ఉన్న ఈమెను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. బొమ్మనహాళ్‌ మండలంలోని ఉంతకల్లు క్రాస్‌లో వారం క్రితం నుంచి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ నరకం అనుభవిస్తోంది. కదలలేని స్థితిలో ఉన్న ఈమె వయసు సుమారు ఎనభై ఉండొచ్చు. ఏ ఊరు..? ఏం పేరు..? అని స్థానికులు అడిగినా స్పందించడం లేదు. ఒక్కోసారి ‘మోకా’ అని అంటోంది. దీంతో కర్ణాటక ప్రాంతం అయ్యుండొచ్చని భావిస్తున్నారు. రక్త సంబంధీకులు ఈమెను వదిలించుకున్నట్లు కనిపిస్తోంది. ఈమె పరిస్థితి చూసి జాలిపడి.. ఆహారం అందిస్తున్నారు. కానీ తినలేకపోతోంది. అధికారులు స్పందించి.. ఏదైనా ఆశ్రమానికి తరలించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

- బొమ్మనహాళ్‌

Read more