విద్యుత చార్జీలు తగ్గించేవరకు ఉద్యమిస్తాం : టీడీపీ

ABN , First Publish Date - 2022-04-24T05:52:12+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా పెంచిన విద్యుత చార్జీలను తగ్గించేంతవరకు ఉద్యమిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పేర్కొన్నారు.

విద్యుత చార్జీలు తగ్గించేవరకు ఉద్యమిస్తాం : టీడీపీ
గుడిపల్లి కొవ్వొత్తుల ర్యాలీలో మాట్లాడుతున్న సవిత

సోమందేపల్లి, ఏప్రిల్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా పెంచిన విద్యుత చార్జీలను తగ్గించేంతవరకు ఉద్యమిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పేర్కొన్నారు. పెంచిన విద్యుత చార్జీలకు నిరసనగా శనివారం రాత్రి మండలంలోని గుడిపల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి కొ వ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్య ప్రజ ల నడ్డివిరుస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కేవలం ఆంధ్రప్రదేశలోనే పెట్రోల్‌, డీజల్‌ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క ళ్లు తెరచి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిరసనలో టీడీపీ మండల కన్వీనర్‌ సిద్దలింగప్ప, నాయకులు నీరుగంటి చంద్ర శేఖర్‌, మాజీ ఎంపీపీ వెంకటేశు లు, వెంకటరాముడు, సర్పంచ నరసింహులు పాల్గొన్నారు. 


Read more