ఎమ్మెల్సీ అనంతబాబును కఠినంగా శిక్షించాలి: అఖిలపక్షం
ABN , First Publish Date - 2022-05-24T06:07:42+05:30 IST
కారు డ్రైవర్ సుబ్రహ్మ ణ్యం హత్య విషయంలో ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అఖిలపక్ష నాయకులు మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించా రు.

తలుపుల, మే23: కారు డ్రైవర్ సుబ్రహ్మ ణ్యం హత్య విషయంలో ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అఖిలపక్ష నాయకులు మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంతబాబు కారుడ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యంను హత్య చేసి, అధికార బలంతో ఆత్మహత్యగా చిత్రీకరిం చాలని చూడడం దారుణమన్నారు. అంతేగాకుండా రాజీకి రావాలంటూ మృతుడి భార్యను బెదిరించడం శోచనీయ మన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేదన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకొని, హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఈశ్వరయ్య, ఎల్‌వీ రమణ, సిద్దయ్య, హసన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దుల రామచంద్ర, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అశోక్, ఎమ్మార్పీఎస్ నాయకులు గంగాధర్ పాల్గొన్నారు.