విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి

ABN , First Publish Date - 2022-10-08T05:15:16+05:30 IST

మండలంలోని గోనబావి గ్రామంలో పొట్టకూటి కోసం కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి వలస వెళ్లిన కూలీ విద్యుదాఘాతంతో శుక్రవారం మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
నాగరాజు (ఫైల్‌)

 గుమ్మఘట్ట, అక్టోబరు 7: మండలంలోని గోనబావి గ్రామంలో పొట్టకూటి కోసం కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి వలస వెళ్లిన కూలీ విద్యుదాఘాతంతో శుక్రవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వడ్డే నాగరాజు (35) కర్ణాటకలోని బెంగళూరు పట్టణంలో శుక్రవారం ఉదయం రామ్‌నగర్‌ ప్రాంతంలో కేబుల్‌ పనులు నిర్వహిస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. నాగరాజు భార్య లక్ష్మి రెండేళ్ల క్రితం బెంగళూ రులో ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఐదుగురు సంతానం. వారు అవ్వతాతల సంరక్షణలో వున్నట్లు తెలి పారు. మృత దేహాన్ని కుటుంబ సభ్యులు బెంగళూరులో పోస్టుమార్టమ్‌ నిర్వహించి స్వగ్రామానికి శుక్రవారం రాత్రికి తీసుకురానున్నట్లు తెలిపారు.  ఐదుగురి సంతానం అనాథలుగా మారిపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. 

Read more