రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-08-09T05:28:13+05:30 IST
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

మడకశిర టౌన/అమరాపురం/లేపాక్షి/గోరంట్ల, ఆగస్టు 8: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి. మడకశిర పట్టణ సమీపంలోని పావగడ రోడ్డు చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం సమీపంలో కేఎస్ ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ప్రమాదం లో మండలంలోని టీడీపల్లికి చెందిన గంగమ్మ (57) అక్కడికక్కడే మృతి చెందింది. పట్టణంలోని శివాపురం నుంచి ద్విచక్రవాహనంలో టీడీపల్లికి వెళుతుండగా, పావగడ వైపు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బ స్సు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన హనుమంతప్పను 108 అం బులెన్సలో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెండు బస్సులు ఢీ
అమరాపురం సమీపంలోని జాలిబావి క్రాస్ వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. అమరాపురం నుంచి పెనుకొండకు వెళ్తున్న ఏపీఎ్సఆర్టీసీ బస్సు, పావగడ నుంచి శిరకు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సులు మ లుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పావగడ నుంచి వస్తున్న కేఎ్‌సఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి అదుపుచేయలేక ఏపీఎ్‌సఆర్టీసీని ఢీకొంది. అధికారు లు స్పందించి మలుపువద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఆటో, ద్విచక్రవాహనం ఢీ
లేపాక్షి ఇందిరమ్మ కాలనీ జాతీయ రహదారిపై ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇరువురు గాయపడినట్లు పోలీసు లు తెలిపారు. లేపాక్షికి చెందిన చంద్రశేఖర్ చిలమత్తూరు నుంచి త న ఆటోలో లేపాక్షికి వస్తున్నాడు. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లికి చెందిన బావక్కగారి ఆదెప్ప ద్విచక్రవాహనంలో లేపాక్షి నుం చి దేమకేతేపల్లికి వెళ్తున్నాడు. ఇందిరమ్మ కాలనీ వద్ద ఎదురెదురుగా ఢీకొనంతో ఆటో బోల్తాపడింది. డ్రైవర్ చంద్రశేఖర్, ఆదెప్ప గాయపడగా 108 అంబులెన్సలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోరంట్ల మండలం శెట్టిపల్లి వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు... ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు భాగ్యమ్మ, సూర్యనారాయణ గాయపడ్డారు. కడప జిల్లా పులివెందులకు చెందిన భా గ్యమ్మ, సూర్యనారాయణలు బెంగళూరులోని దేవనహళ్లి వద్ద రహదారి పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. ద్విచక్రవాహనంపై స్వగ్రామమైన పులివెందులకు వస్తుండగా ప్రమాదం జరిగింది. శెట్టిపల్లి స్పీడ్ బ్రేకర్ వద్ద వెనుక నుండి కర్ణాటక బస్సు ఓవర్‌టెక్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. గాయపడిన దంపతుల ను గోరంట్ల ఆసుపత్రికి, అనంతరం హిందూపురం తరలించారు.