ప్రార్థనా మందిరం నుంచి కిందపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-06T05:28:13+05:30 IST

పట్టణంలో ని ఆబాద్‌పేటలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి బోయపేటకు చెందిన గోవిందరాజు (52) మృతి చెందాడు.

ప్రార్థనా మందిరం నుంచి కిందపడి వ్యక్తి మృతి
మృతుడు గోవిందరాజులు

హిందూపురం టౌన, జూలై 5: పట్టణంలో ని ఆబాద్‌పేటలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి బోయపేటకు చెందిన గోవిందరాజు (52) మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాలివి.  మధ్యాహ్నం గోవిందరాజు ప్రా ర్థనా మందిరం పైభాగంలో శుభ్రం చేస్తున్నా డు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి గా యపడ్డాడు. బాధితున్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగై న వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో వీధిన పడ్డామని, న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వనటౌన సీఐ ఇస్మాయిల్‌ తెలిపారు. 


Updated Date - 2022-07-06T05:28:13+05:30 IST