పార్లమెంట్ సభ్యత్వానికి మాధవ్ రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2022-08-14T05:45:51+05:30 IST
సభ్య సమాజం తలదించుకునే లా ప్రవర్తించిన గోరంట్ల మాధవ్ వెంటనే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తి ప్పేస్వామి డిమాండ్ చేశారు.

చంద్రబాబు, ఏబీఎన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను విమర్శించే స్థాయి కాదు..
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి
మడకశిర టౌన, ఆగస్టు 13: సభ్య సమాజం తలదించుకునే లా ప్రవర్తించిన గోరంట్ల మాధవ్ వెంటనే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తి ప్పేస్వామి డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బాలాజీనగర్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాధవ్‌కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏబీఎన ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాక్రిష్ణను విమర్శించే స్థాయి మాధవ్‌ది కాద న్నారు. ఓటమి ఎరగని నేత చంద్రబాబు అని, సుదీర్ఘ కాలం ము ఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోనే ఆదర్శంగా పేరుగడించారని అన్నా రు. అలాంటి నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగడం న్యాయమా అం టూ ప్రశ్నించారు. నీచమైన పనికిమాలిన పనిచేసి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడి చేయడం వైసీపీ నాయకులకు సిగ్గుచే టన్నారు. ఏబీఎన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ప త్రిక ద్వారా సమాజంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపుతున్నా రని అన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నారని వారిపై కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు చేయడం నీచ సంస్కృతి అన్నారు. వైసీ పీ నేతలు తమ తప్పులను జీర్ణించుకోలేకనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ఇప్పటికైనా గోరంట్ల మాధవ్‌కు సిగ్గు ఉం టే వెంటనే తప్పును ఒప్పుకొని చంద్రబాబు, రాధాకృష్ణకు క్షమాప ణచెపాల్పలని, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆ యన డిమాండ్ చేశారు.