-
-
Home » Andhra Pradesh » Ananthapuram » M Agraharam is a villager who gave a strong shock to Dharmavaram MLA anantapur andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
shock to Dharmavaram MLA: నీ పథకాలు అవసరం లేదన్న గ్రామస్థుడు... ధర్మవరం ఎమ్మెల్యేకు గట్టి షాక్
ABN , First Publish Date - 2022-10-01T16:10:39+05:30 IST
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికు ఎం. అగ్రహారం గ్రామానికి చెందిన కొండన్న గారి శివయ్య గట్టి షాక్ ఇచ్చారు.

అనంతపురం: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Ketireddy venkataramireddy)కి ఎం. అగ్రహారం గ్రామానికి చెందిన కొండన్న గారి శివయ్య గట్టి షాక్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Dharmavaram MLA) పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన టీడీపీ జెండా దిమ్మెను చూసి... ‘‘మేం వస్తున్నామని జెండా కట్టారా’’ అని కేతిరెడ్డి మాట్లాడారు. ఆపై కొండన్న గారి శివయ్య కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా లభించిన లబ్ది వివరాల కరపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. అయితే ‘‘నీ పథకాలు అవసరం లేదు’’ అంటూ కొండన్న గారి శివయ్య కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరించారు. దీంతో కేతిరెడ్డి బిక్క మొహం వేసుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. ‘‘ప్రభుత్వ పథకాలు అవసరం లేదా అంటూ శివయ్య కుటుంబ సభ్యులను కేతిరెడ్డి ప్రశ్నించగా... నీ ప్రభుత్వ పథకాలు అవసరం లేదు’’ అంటూ శివయ్య కుటుంబ సభ్యులు తిరస్కరించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున్న వైరల్గా మారింది.