ప్రేమ.. పగ..!

ABN , First Publish Date - 2022-08-04T05:54:12+05:30 IST

కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి విద్యుత సబ్‌స్టేషన వద్ద స్కూటర్‌ మీద వెళుతున్న యువతిని కారు ఢీకొట్టిన సంఘటన కొత్త మలుపులు తిరుగుతోంది.

ప్రేమ.. పగ..!
బాధితురాలిని పరామర్శిస్తున్న మాజీ మేయర్‌ స్వరూప, తెలుగు మహిళలు

యువతిపై జరిగింది హత్యాయత్నం
కళ్యాణదుర్గం ఘటనపై పోలీసు దర్యాప్తు
కంబదూరు (కళ్యాణదుర్గం)/అనంతపురం అర్బన, ఆగస్టు 3:
కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి విద్యుత సబ్‌స్టేషన వద్ద స్కూటర్‌ మీద వెళుతున్న యువతిని కారు ఢీకొట్టిన సంఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో దీని వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. మూడు రోజుల క్రితం స్కూటర్‌ మీద వెళుతున్న ఓ యువతిని కారు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన యువతి అనంతపురంలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కారు డ్రైవర్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రమాదంలో గాయపడిన యువతి, డ్రైవర్‌ భాస్కర్‌ బుక్కరాయసముద్రం మండలానికి చెందిన వారని కళ్యాణదుర్గం రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. గతంలో ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిపారు. యువతి తల్లి ఉద్యోగం నిమిత్తం కళ్యాణదుర్గానికి బదిలీ కావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యువతి నుంచి స్పందన లేకపోవడంతో భాస్కర్‌కు కోపం వచ్చి, కక్ష పెంచుకున్నాడని తెలిపారు. ఈ కారణంగానే కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నం చేశాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

తెలుగు మహిళల ఆగ్రహం
గిరిజన విద్యార్థినిపై ప్రేమ పేరిట హత్యాయత్నానికి పాల్పడటం హేయమని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు స్వరూప మండిపడ్డారు. చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె బుధవారం పరామర్శించారు. రాష్ట్రంలో దిశ యాప్‌ ఉన్నా అఘాయిత్యాలు ఆగడం  లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాదులకు కఠిన శిక్ష విధించి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే వీరాంజినేయులు, తెలుగు మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రియాంక, రంగమ్మ, అరుణ, స్రవంతి  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:54:12+05:30 IST