యువత గళాన్ని వినిపించేందుకే లోకేశ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-12-31T00:35:46+05:30 IST

యువత గళాన్ని వినిపించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ యువ గళం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు

యువత గళాన్ని వినిపించేందుకే లోకేశ పాదయాత్ర
మీడియాతో మాట్లాడుతున్న పరిటాల సునీత

ప్రతి ఒక్కరూ భాగస్వాములై జయప్రదం చేయండి

మాజీ మంత్రి పరిటాల సునీత

అనంతపురం అర్బన, డిసెంబరు 30: యువత గళాన్ని వినిపించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ యువ గళం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురంలోని స్వగృహంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జనవరి 27వతేదీ కుప్పం నుంచి నారా లోకేశ పాదయాత్ర ప్రారంభమతుందన్నారు. 100 నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై జయప్రదం చేయాలని ఆమె కోరారు. 9686296862 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా పాదయాత్రకు మద్దతునిస్తూ పాల్గొనవచ్చునన్నారు. వైసీపీ పాలనలో యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం నింపడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన దురదృష్ట ఘటనలో ఎనిమిది మంది మరణిస్తే దాన్ని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేయడం సరికాదన్నారు. జగన, ఆయన తల్లి విజయమ్మ, వైఎస్‌ షర్మిల పాదయాత్ర సమయంలో ఎనిమిది మంది చనిపోయారని, ఆ ఘటనలకు మీరు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో సీఎం జగన నిర్లక్ష్యం, అసమర్థత, కమీషన్ల కక్కుర్తితో 173 మంది ప్రాణాలు కోల్పోయారని, వాటన్నింటికీ సీఎం జగన బాధ్యత వహించాలన్నారు. కందుకూరు ఘటన జరిగిన తర్వాత చంద్రబాబునాయుడు స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడంతోపాటు రూ.15 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించార న్నారు. ప్రధాని, గవర్నర్‌ స్పందించిన తర్వాతగానీ సీఎం ఈ ఘటనపై నోరుమెదపలేదన్నారు. వైసీపీ అరాచక పాలన, వికృతచేష్టలను ప్రజలంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Updated Date - 2022-12-31T00:35:48+05:30 IST