పీఏబీఆర్‌ గేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2022-12-16T23:44:38+05:30 IST

పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) గేట్లను ఎత్తి, ఇరిగేషన అధికారులు దిగువనున్న మిడ్‌పెన్నార్‌ డ్యాంకు నీటిని వదిలారు.

 పీఏబీఆర్‌ గేట్ల ఎత్తివేత

కూడేరు, డిసెంబరు 16: పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) గేట్లను ఎత్తి, ఇరిగేషన అధికారులు దిగువనున్న మిడ్‌పెన్నార్‌ డ్యాంకు నీటిని వదిలారు. శుక్రవారం పీఏబీఆర్‌ మూడు గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు ఇరిగేషన ఏఈ లక్ష్మీదేవి తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పేరూరు డ్యాం నిండిపోవడంతో అక్కడి అధికారులు పీఏబీఆర్‌కు దాదాపు 1000 క్యూసెక్కుల నీరు వదిలారు. దీనికి తోడు లింక్‌ చానల్‌ నుంచి రెండువందలు, హంద్రీ నీవా నుండి రెండు వందల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో పీఏబీఆర్‌ నుంచి దిగువకు నీటిని వదిలినట్లు ఏఈ తెలియజేశారు.

Updated Date - 2022-12-16T23:45:10+05:30 IST