వైసీపీ పాలనకు చరమగీతం పాడుదాం

ABN , First Publish Date - 2022-01-20T06:04:34+05:30 IST

రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడి 2024లో చంద్రబాబునా యుడును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నియోజకవర్గం పరిశీలకులు డోన నాగేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు.

వైసీపీ పాలనకు చరమగీతం పాడుదాం
సమావేశంలో మాట్లాడుతున్న నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వరరావు


: టీడీపీ శింగనమల నియోజవకవర్గ పరిశీలకులు నాగేశ్వరరావు

గార్లదిన్నె, జనవరి 19 : రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడి 2024లో చంద్రబాబునా యుడును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నియోజకవర్గం పరిశీలకులు డోన నాగేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు. మండల ప రిధిలోని కల్లూరులో బుధవారం రాత్రి మండల విస్తృతస్థాయి స మావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఒక్క చాన్స అంటూ అనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మో హనరెడ్డి పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నార న్నారు.  గత ప్రభుత్వాలలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో దోపిడీకి తెరలేపారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, మైనింగ్‌, మద్యం మాఫియా విచ్చలవిడిగా సాగుతోందన్నారు.  అ సెంబ్లీలో చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ మాట్లాడి ఆయన తో కన్నీరు పెట్టించి గౌరవసభను కౌరవసభగా మార్చారని మండి పడ్డారు. ఇలాంటి ప్రభుత్వానికి 2024లో ఓటుతో బుద్ధి చెప్పి... చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు టీడీపీ కుటుం బ సభ్యులందరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా శింగనమల నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలసి కట్టుగా ప నిచేసి శింగనమల కోటపై టీడీపీ జెండా ఎగరవేస్తామని కేశవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జయరాం, మాజీ ఎంపీ పీ నాగరాజు, మాజీ జడ్పీటీసీలు విశాలాక్షి, గుర్రం ఆదినారా యణ, ఇల్లూరు రామాంజనేయులు, గేటుక్రిష్ణారెడ్డి, డేగల కృష్ణమూ ర్తి, గు త్తా బాలకృష్ణ, పాండు, వెంకటేశ్వరనాయుడు, హను మంత రెడ్డి, ప రశురాం, సుదర్శన, పుల్లన్న, దండు శ్రీనివాసులు, వన్నుర్‌, గుర్రం శ్రీ నివాసులు, రమణప్ప, నరసింహారెడ్డి, సురేష్‌, రామాంజ నే యా చారి, రమణచౌదరి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

మండల నూతన కన్వీనర్‌గా పాండు

 తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్‌గా  పాం డు రంగనాయకులు ఎంపిక య్యారు. బుధవారం టీడీపీ మండల విస్తృత స్థాయి స మావేశం అనంతరం ని యోజకవర్గం అబ్జర్వర్‌ నా గేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి సమక్షంలో మండల కమిటీని ఎంపిక చేశారు. మండల కన్వీనర్‌గా గార్లదిన్నెకు చెందిన పాండు రంగనాయకులు, తెలుగుయువత మండ లాధ్యక్షుడిగా కల్లూరుకు చెందిన శ్రీనాథ్‌నాయుడును ఎంపిక చేశారు. పార్టీ బలోపే తానికి తనవంతు కృషి చేస్తానని నూతన కన్వీనర్‌గా ఎంపికైన పాండు తెలిపారు.  ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి ఎంపిక చేసినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కమిటీ, తెలుగుయువత అధ్యక్షులకు నాయకులు సన్మానం చేశారు. 


Updated Date - 2022-01-20T06:04:34+05:30 IST