ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2022-09-08T05:36:48+05:30 IST

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా అన్నివర్గాలూ సమష్టిగా ఉద్యమిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పిలుపునిచ్చారు.

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

 సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌

 అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 7: ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా అన్నివర్గాలూ సమష్టిగా ఉద్యమిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన స్థానిక గణేనాయక్‌ భవనలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 8 సంవత్సరాలుగా మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అథోగతి పాలైందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయని, బియ్యం, పాలు, నూనెలు, పప్పుదినుసులు సహా అన్ని వస్తువులపైనా జీఎస్టీ పేరుతో భారం మోపారన్నారు. శ్మశాన సేవలకూ జీఎస్టీ వేయడం సిగ్గుచేటన్నారు. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1100లు దాటిందని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇష్టారాజ్యంగా పెంచేసి రూ.27లక్షల కోట్ల భారాన్ని ప్రజలనెత్తిన రుద్దారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసి, బ్యాంకులు, బీఎ్‌సఎనఎల్‌తోపాటు అన్నింటటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. అంబానీలు, ఆదానీలకు పోర్టులు, విమానాశ్రయాలు, టెలికం, విద్యుత ఇలా ఒక్కొక్కటీ అప్పగించేస్తున్నారని మండిపడ్డారు.  రిటైల్‌ వ్యాపారంలోకి విదేశీ, కార్పొరేట్‌ కంపెనీలను అనుమతించి చిరు వ్యాపారులను నాశనం చేశారన్నారు.  కార్మికులకు ఉద్యోగు భద్రత లేదని, కార్మిక కోడ్‌లను తెచ్చి, ఉన్న హక్కులను హరించివేశారని విమర్శించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఓట్లు వేసి బీజేపీకి మద్దతు పలకడం శోచనీ యమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 28వ తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టే ఆందోళన ప్రచార కార్యక్రమాల్లో అన్నివర్గాలవారు భాగస్వాములవ్వా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య పాల్గొన్నారు.


Read more