మొండి వైఖరి వీడండి

ABN , First Publish Date - 2022-01-29T05:42:46+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండివైఖరి వీడాలని పీఆర్సీ సాధన స మితి నాయకులు సూచించారు.

మొండి వైఖరి వీడండి
రెండోరోజు రిలే నిరాహార దీక్షలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు

పాత విధానంలోనే జీతాలివ్వాలి 

ఉద్యోగులు, ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు

రిలే నిరాహార దీక్షలో పీఆర్సీ సాధన సమితి నాయకులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 28: రివర్స్‌ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండివైఖరి వీడాలని పీఆర్సీ సాధన స మితి నాయకులు సూచించారు. ఉద్యమ కార్యచరణలో భాగంగా ఆ సాధన సమితి నాయకుల రిలే నిరాహార దీక్షలు రెండోరో జూ కొనసాగాయి. కేఎస్‌ఆర్‌ కళాశాల ఎ దుట ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ-అమరావ తి, ఏపీ జీఈఏ, ఏపీ జీఈఎఫ్‌ జేఏసీ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, ఫ్యాప్టో సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరాహార దీక్ష కొనసాగించారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన అతావుల్లా మాట్లాడుతూ పదిరోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ సలహాదారుల ద్వారా జేఏసీ నేతలతో చర్చలు, సంప్రదింపులతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టమని హెచ్చరించారు. 11వ పీఆర్సీ ఏ ఒక్కరికీ ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేశారు. రివర్స్‌ పీఆర్సీని రద్దు చేసేంత వరకూ ఉద్య మం ఆగదన్నారు.  ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కేసులు, ఒత్తిళ్లతో అణచాలని చూస్తే తమ ఆగ్రహాన్ని చవిచూడక  తప్పదన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగు లు, ప్రజల మధ్య చిచ్చుపెట్టాలనే చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్‌ రద్దు చేస్తామన్న  హామీని సీఎం నిలబెట్టుకోవాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా పెన్షనర్లను ఇబ్బంది పెడుతోందని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌ ఆరోపించారు. ఈహెచఎ్‌స, రీయింబర్స్‌మెంట్‌లను రద్దు చేసి వైద్యానికి దూరం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను రద్దు చేసి పెన్షనర్ల ఊపిరి తీసేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ-అమరావతి జిల్లా చైర్మన దివా కర్‌రావు, ఏపీ జీఈఏ చైర్మన  గోపీకృష్ణ, ఏపీ జీఈఎఫ్‌ చైర్మన రాధాకృష్ణరెడ్డి, ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, ఫ్యాప్టో జనరల్‌ సెక్రటరీ సాలెవేముల బాబు, నాయకులు సూరీడు, రమణారెడ్డి, రాజశేఖర్‌, జయచంద్రారెడ్డి, నాగేంద్ర, పెన్షనర్ల సంఘం నాయకులు ఖలందర్‌, రామకృష్ణ, సత్యనారాయణ, ఓబన్నగౌడ్‌, మధుసూదన, ఏపీ జేఏసీ నగర చైర్మన మనోహర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, నాయకులు ఈశ్వరయ్య, సుధాకర్‌, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, ఎస్టీయూ జిల్లా ప్రధా న కార్యదర్శి రమణారెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సూరీడు, ఇరిగేషన నాయకులు మహ బూబ్‌ దౌలా, శ్రీనివాసులు, ఉమాశంకర్‌, శివనాగప్రసాద్‌, మహబూబ్‌ బాషా, రాజేష్‌, రామకృష్ణ, వీరాంజనేయులు, వెంకటనారాయణ, పుట్లూ రు సుధాకర్‌, ఏపీఎన్జీఓ నాయకులు రవికుమార్‌, శ్రీధర్‌బాబు, జమీలాబేగం, సీఐటీయూ వెంకటనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:42:46+05:30 IST