ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండకడతాం..
ABN , First Publish Date - 2022-01-13T06:22:34+05:30 IST
ప్రభుత్వ వ్యతిరేక విధానా లను ఎండకట్టాలనే ఉద్దేశ్యంతో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్ హిందూపురం పార్లమెం ట్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ తెలిపారు.
-టీఎన్‌ఎస్‌ఎఫ్
ధర్మవరం, జనవరి 12: ప్రభుత్వ వ్యతిరేక విధానా లను ఎండకట్టాలనే ఉద్దేశ్యంతో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్ హిందూపురం పార్లమెం ట్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ తెలిపారు. బుధవారం టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ‘మన రాష్ట్రాన్ని మనమే బాగుచేసుకుందాం’ అనే నినాదంతో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణమం తా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు బండారు భార్గవ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇర్షాద్, తిరుమలేశ్, రాప్తాడు నియో జకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు భార్గవ్, నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు వినోద్, హరి, ఇమ్రాన్, నవీన్ పాల్గొన్నారు.
గాండ్లపెంట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వామివివేకానంద జయంతి, యువజన దినోత్సవం పురస్కరిం చుకుని కదిరి, గాండ్లపెంటకు చెందిన తెలుగుయువత నాయకులు శ్రమ దానం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవర ణలోని పిచ్చిమొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. మున్ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు బాబ్‌జాన్, నియోజకవర్గ అధ్యక్షుడు గంగయ్య నాయుడు, కార్యదర్శి ఆంజనేయులు, గాండ్ల మండల అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షులు దాదాపీర్, ఎంపీటీసీ సభ్యుడు జయరామ్ క్రిష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ గంగరాజు, మాజీ సర్పంచు ప్రసాద్, నాయకులు కొండయ్య, చం ద్ర, క్రిష్ణానాయక్, వెంకటరమణారెడ్డి, అమీర్, మహబూబ్‌బాషా తదిత రులు పాల్గొన్నారు.