వైభవంగా కొటిపి చౌడేశ్వరీదేవి రథోత్సవం
ABN , First Publish Date - 2022-04-06T05:07:32+05:30 IST
కొటిపిలో వెలసిన చౌడేశ్వరీ దేవి బ్ర హ్మ రథోత్సవం మంగళవారం భక్తజనసందోహం నడుమ వైభవంగా సా గింది.
హిందూపురం టౌన, ఏప్రిల్ 5: కొటిపిలో వెలసిన చౌడేశ్వరీ దేవి బ్ర హ్మ రథోత్సవం మంగళవారం భక్తజనసందోహం నడుమ వైభవంగా సా గింది. సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి అధిష్టింపజేశారు. అమ్మవారి నామస్మర ణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం నడుమ అమ్మవారు బ్రహ్మరథంపై ఊరేగారు. మహిళలు జ్యోతులను ఊ రేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాం తాల నుంచి భక్తులు తరలివచ్చారు. కొటిపి గ్రామం భక్తులతో కిక్కిరిసిం ది. సీఐ జీటీ నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. అదేవి ధంగా పట్టణంలోని సూరప్పకట్ట సమీపంలో వెలసిన మారెమ్మ, సరస్వ తి టాకీస్ సమీపంలో పులేకమ్మకు జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగిం ది. మహిళలు జ్యోతులను ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించారు.
మల్లాలమ్మ జాతర
గోరంట్ల: పట్టణ మేదర సంఘం ఆధ్వర్యంలో మల్లాలమ్మ జాతరను మంగళవారం వేడుకగా నిర్వహించారు. చిత్రావతి వద్ద మల్లాలమ్మను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పూజారి వెంకటస్వామి వెదురుబుట్టలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురాగా మహిళలు జ్యోతులతో స్వాగతించారు. గొరవయ్యలు ఉరుము వాయిద్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎస్‌ఎపీఎస్ జూనియర్ కళాశాల వద్దవున్న పురాతన మల్లాలమ్మ ఆలయం వద్ద అమ్మవారికి సాంప్రదాయంగా పూజలు చేశారు. మేదరలు తరలివచ్చి ఇలవేల్పును దర్శించుకున్నారు.
మడకశిర అర్బన: ఉగాది వేడుకల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరుమారెమ్మ, కొల్లాపురమ్మ, వడిసలమ్మ, ముత్యాలమ్మ అమ్మవారిని వివిధ పూలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు జ్యోతులు మోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. చంద్రమౌళేశ్వర, బోగరామేశ్వరస్వామి ఆలయాల్లో స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. భ క్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
కనుమ మారెమ్మకు జ్యోతుల ఉత్సవం
మడక శిర రూరల్: మండలంలోని ఆమిదాలగొంది సమీప కొండలో వెలసిన కనుమమారెమ్మకు మంగళవారం మహిళలు జ్యోతుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మడకశిర, ఆమిదాలగొంది, టీడీపల్లి, ఏఆర్‌రొ ప్పం, హెచఆర్ పాళ్యం, ఎగువ అచ్చంపల్లి, గౌరీపురం, రామగిరి గ్రామా ల నుంచి మహిళలు హారతులతో ఊరేగింపు చేపట్టారు.
కరియమ్మ దేవికి హారతులు
గుడిబండ: మండలంలోని మోరుబాగల్ గ్రామంలో మంగళవారం క రియమ్మ దేవికి హారతుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని పూలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు హారతులు మోసి మొక్కుబడులు తీర్చుకున్నారు.
సప్పలమ్మకు ప్రత్యేక పూజలు
లేపాక్షి: మండలంలోని కొండూరు, కల్లూరు గ్రామాల్లో వెలసిన సప్పల మ్మ ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళ లు దీపాలు, జ్యోతులతో అమ్మవారిని పూజించారు.