ఖర్మలా వైసీపీ పాలన

ABN , First Publish Date - 2022-11-30T23:54:07+05:30 IST

వైపీపీ పాలనను ప్రజలు ఖర్మలా భావిస్తున్నారని మాజీమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని స్వగృహంలో రాప్తాడు నియోజక వర్గం టీడీపీ నాయకులు, శ్రేణులతో ఆమె సమావేశమయ్యారు. ముందుగా ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.

ఖర్మలా వైసీపీ పాలన
‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న పరిటాల సునీత, హాజరైన కార్యకర్తలు

ప్రజలు ఇదే భావనలో ఉన్నారు

ప్రభుత్వ వైఫల్యాలు, దుర్మార్గాలను అందరికీ చెబుదాం

‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ని జయప్రదం చేద్దాం

మాజీమంత్రి పరిటాల సునీత

అనంతపురం అర్బన, నవంబరు 30: వైపీపీ పాలనను ప్రజలు ఖర్మలా భావిస్తున్నారని మాజీమంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని స్వగృహంలో రాప్తాడు నియోజక వర్గం టీడీపీ నాయకులు, శ్రేణులతో ఆమె సమావేశమయ్యారు. ముందుగా ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం పరిటాల సునీత మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మాకు ఇదేం ఖర్మ అనే భావనలో ఉన్నారన్నారు. అందుకే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. డిసెంబరు 2వతేదీ రామగిరి మండలం శ్రీహరిపురం కాలనీ నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ అరాచకపాలనను ప్రజలకు వివరించడంతోపాటు స్థానిక ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై ఆరా తీయాలన్నారు. 50 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మండల కన్వీనర్లు, సీనియర్‌ నాయకులు, మాజీ సర్పంచలు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత ఇనచార్జిలు ప్రత్యేక చొరవ తీసుకొని ఇతర నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సభ్యత్వ నమోదు తరహాలోనే రాప్తాడు నియోజకవర్గం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణలో ముందుండేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి సోదరుల దౌర్జన్యాలను ప్రజలకు వివరించాలన్నారు. జాకీ పరిశ్రమ తోపుదుర్తి బ్రదర్స్‌ బెదిరింపులతోనే ఇతర ప్రాంతానికి వెళ్లిందన్న విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లాలన్నారు. చంద్రబాబు, నారా లోకేశపై తోపుదుర్తి సోదరుల అనుచిత వాఖ్యల ప్రస్తావన తేవాలన్నారు. లోకేశ పాదయాత్రను రాప్తాడు నియోజకవర్గంలో దిగ్విజయం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-30T23:54:07+05:30 IST

Read more