రేపు కసాపురం ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2022-10-24T00:14:46+05:30 IST

పాక్షిక సూర్యగ్రహణం కారణంగా కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానాన్ని మంగళవారం మూసివేస్తున్నామని ఆలయ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

రేపు కసాపురం ఆలయం మూసివేత

గుంతకల్లు, అక్టోబరు 23: పాక్షిక సూర్యగ్రహణం కారణంగా కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానాన్ని మంగళవారం మూసివేస్తున్నామని ఆలయ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమావాస్య సందర్భంగా మంగళవారం సాయంత్రం 5-02 గంటల నుంచి 6-27 గంటల వరకూ కేతుగ్రస్థ పాక్షిక సూర్య్రగహణం సంభవిస్తున్నదని తెలిపారు. దీంతో 25వ తేదీ ఉదయం 8-20 గంటలకు గుడిని మూసివేస్తామని తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపడతామన్నారు. ఆర్జిత సేవలు బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

నేడు ధనలక్ష్మి పూజ

దీపావళి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కసాపురం ఆలయంలో ధనలక్ష్మి పూజను నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే ధనలక్ష్మి పూజకు భక్తులు హాజరుకావాలని కోరారు.

Updated Date - 2022-10-24T00:14:50+05:30 IST