కల్యాణం.. కమనీయం

ABN , First Publish Date - 2022-11-30T00:16:40+05:30 IST

గార్లదిన్నె మండలం కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా మంగళవారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.

కల్యాణం.. కమనీయం
స్వామి, అమ్మవార్ల కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు

గార్లదిన్నె మండలం కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా మంగళవారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, పూజల అనంతరం కోటంక గ్రామానికి చెందిన ఆవుల నాగలక్ష్మి, ఆవుల సుబ్బరాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారితో శ్రీవల్లి, దేవసేన అమ్మవార్లతో కల్యాణ జరిపించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

- గార్లదిన్నె

Updated Date - 2022-11-30T00:16:40+05:30 IST

Read more