చెప్పేందుకే సుద్దులు!
ABN , First Publish Date - 2022-12-15T00:17:38+05:30 IST
విద్యుత పొదుపు అందరి బాధ్య త. విద్యుతను ఆదా చేయాలి. భావితరాలకు వెలుగు అందించాలి. ఇవి విద్యుత అధికారులు వినియోగదారులకు తరచూ చెప్పే మాటలు. ఈ మాటలు వారికి మాత్రం వర్తించడం లేదు
విద్యుత వృథాపై విద్యుత అధికారులు, ఉద్యోగుల తీరు
పట్టపగలైనా లైట్లు
వెలగాల్సిందే.. ఖాళీ కుర్చీలకు ఫ్యాన తిరగాల్సిందే!
అనంతపురంరూరల్: విద్యుత పొదుపు అందరి బాధ్య త. విద్యుతను ఆదా చేయాలి. భావితరాలకు వెలుగు అందించాలి. ఇవి విద్యుత అధికారులు వినియోగదారులకు తరచూ చెప్పే మాటలు. ఈ మాటలు వారికి మాత్రం వర్తించడం లేదు. విద్యుతను వృథా చేయకూడదని చెప్పే వారే ఆ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. పట్టపగలైనా ఆఫీ్‌సలో లైట్లు వెలగాల్సిందే. ఖాళీ కూర్చీలకు ఫ్యాన తిరగాల్సిందే. నగరంలోని జేఎనటీయూ రోడ్డు పక్కన ఉన్న విద్యుత ప్రధాన కార్యాల యంలో బుధవారం కనిపించిన ఈ చిత్రాలే అధికారుల విద్యుత పొదుపు చిత్తశుద్ధిని తెలుపుతా యి. బుధవారం నుంచే శాఖలో విద్యుత పొదుపు వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ ముందురోజే వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు ఇతరత్ర వాటిని ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. అంతలోనే క్షేత్రస్థాయిలోని అధికారులు, ఉద్యోగు లు, సిబ్బంది వాటిని మరచిపోయారో లేక నిర్లక్ష్యంగా వదిలేశారో..!