సచివాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీసీఈఓ
ABN , First Publish Date - 2022-11-25T23:33:18+05:30 IST
మండల కేంద్రంలోని ముదిగుబ్బ-4 సచివాలయం పొడరాళ్లపల్లి సచివాలయాలు, చెత్తసంపద తయారీకేంద్రాలను జడ్పీసీఈఓ భాస్కర్‌రెడ్డి ఆకస్మిక నిర్వహించారు.
ముదిగుబ్బ, నవంబరు 25: మండల కేంద్రంలోని ముదిగుబ్బ-4 సచివాలయం పొడరాళ్లపల్లి సచివాలయాలు, చెత్తసంపద తయారీకేంద్రాలను జడ్పీసీఈఓ భాస్కర్‌రెడ్డి ఆకస్మిక నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీసీఈఓ రికార్డులను పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయం సిబ్బందికి ఆదేశించారు. చెత్తసంసంప్రదాయాలు కేంద్రానికి వెళ్లే దారి అధ్వాన్నంగా ఉండడంతో వాటిని వెంటనే మరమత్తులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీఓ శివారెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.